»   » ‘ఎవడు’ విడుదల తేదీలో మార్పు లేదు

‘ఎవడు’ విడుదల తేదీలో మార్పు లేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న 'ఎవడు' చిత్రం జులై 31న విడుదల చేయడానికి సిద్ధమైనప్పటికీ..... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఆగస్టు 7న విడుదలకు సిద్ధం అవడంతో ముందుగానే రిలీజ్ చేయబోతున్నారనే ప్రచారం జరిగింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 'ఎవడు' విడుదల తేదీ విషయంలో ఎలాంటి మార్పు చేయలేదని స్పష్టం అవుతోంది. ముందుగా అనుకున్న విధంగానే ఈ చిత్రాన్ని జులై 31నే విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. సెంటిమెంటు కలిసొస్తుందని జులై 31(మగధీర రిలీజ్ డేట్)ని ఫైనల్ చేసినట్లు స్పష్టం అవుతోంది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎవడు సినిమా తెరకెక్కింది. శృతి హాసన్, ఎమీ జాక్సన్ హీరోయిన్లు. దిల్ రాజు నిర్మాత. ఈచిత్రంపై మెగా ఫ్యామిలీ పూర్తి నమ్మకంతో ఉంది. ఆడియో వేడుకలో చిరంజీవి ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా మగధీరను మించిన హిట్టవుతుందని స్పష్టం చేసారు.

మగధీర తర్వాత ఆ రేంజి హిట్టయ్యే సినిమా 'ఎవడు' మాత్రమే. మగధీరకు ఏమాత్రం తీసి పోని సినిమా ఇది, మగధీర తర్వాత ఇంత తక్కువ సమయంలో ఎవడు లాంటి సినిమా చేసే అవకాశం రావడం చరణ్ అదృష్టమే. అభిమానులు ఏ రేంజిలో ఊహించుకున్నా ఆ రేంజిని అందుకునే సత్తా ఉన్న సినిమా ఎవడు అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

English summary
No Change on Release Date of Yevadu, The movie releasing on 31st July. ‘Yevadu’ has Shruti Haasan and Amy Jackson as the female leads. Vamshi Paidipally is the director of this movie and Dil Raju is the producer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu