»   »  రూమరే అని మరోసారి తేల్చేసిన రాజమౌళి

రూమరే అని మరోసారి తేల్చేసిన రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా 'బాహుబలి' ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. కర్నూలు సమీపంలోని కొండ ప్రాంతాల్లో ఇటీవల కొన్ని సీన్లు చిత్రీకరించారు. ఇటీవల బహుబలి గురించి ఓ రూమర్ ప్రచారంలోకి వచ్చింది.

హాలీవుడ్ మూవీ 'ట్రాయ్' సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన నాథన్ జోన్స్ బాహుబలి లో నటిస్తున్నట్లు గాసిప్స్ వినిపించాయి. దీనిపై రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. బాహుబలి సినిమాలో హాలీవుడ్ నటులెవరూ నటించడం లేదని స్పష్టం చారు.

బాహుబలి చిత్రంలో ప్రభాస్‌ సరసన అనుష్క హీరోయిన్‌గా నటిస్తుండగా రాణా ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం కోసం 'arri alexa XT' కెమెరాలను ఉపయోగించనున్నారు. ఈచిత్రాన్ని తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. అయితే హిందీ, మలయాళంతో పాటు ఇతర వీదేశీ భాషల్లోనూ విడుదల చేయాలనే ఆలోచన చేస్తున్నారు.

ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ప్రధాన భూమిక పోషించనున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు. 'బాహుబలి' చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ ఆధ్వర్యంలో సెట్స్ వేసారు.

English summary
"No Hollywood actors are signed for #Baahubali. False news again." Rajamouli tweeted. ‘Bahubali‘ has finally begun to Kurnool and the main cast of Prabhas and Rana Daggubati are participating in it.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu