»   » ప్లాప్ సినిమాల డైరెక్టర్స్‌తో నటిస్తున్న బాలయ్యని అభిమానులు క్షమిస్తారా..?

ప్లాప్ సినిమాల డైరెక్టర్స్‌తో నటిస్తున్న బాలయ్యని అభిమానులు క్షమిస్తారా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటీవల కాలంలో సీనియర్ దర్శకుడు దాసరి నారాయణరావు పరమవీర చక్ర సినిమాతో ఇచ్చిన బాక్సాఫీసు ఫ్లాపుతో కంటిమీద కునుకు లేకుండా కంగారు పడుతున్న బాలయ్య బాబుకి ఇప్పుడు ఇంకోక కొత్త చిక్కు వచ్చిపడిందని అనుకుంటున్నారు. ఈసారీ మరో సీనియర్ దర్శకుడు బాపు, బాలయ్య బాబుతో సినిమా తెరకెక్కిస్తుండడమే ఆ కొత్త చిక్కు. మొన్నాఆమద్య సుందరకాండ అనే బీభత్సమైన ప్లాప్ సినిమా తీసిన బాపు తన తాజా చిత్రంగా బాలయ్య బాబుతో శ్రీరామరాజ్యం సినిమా తీస్తున్న విషయం తెలిసిందే.

పూర్వకాలంలో బాపు ఆణిముత్యాలు లాంటి సినిమాలు తీసిన సుందరకాండ, రాధాగోపాలం వంటి వరుస ప్లాపులతో ఉన్న బాపు బాలయ్య బాబుని ముంచేయడం ఖాయమనే గాసిప్స్ ఫిలింనగర్ వినపడుతున్నాయి. టాలీవుడ్ మాంచి కమర్షియల్ సినిమా అయినటువంటి సింహా తర్వాత కూడా బాలయ్య బాబు ఆరేంజ్ సినిమాలు తీయగలిగే కమర్షయల్ డైరెక్టర్స్‌ను వదిలివేసి, ఇలా పాతతరం ముసలి దర్శకులు అయినటువంటి బాపు, దాసరితో సినిమాలు ఎందుకు తీస్తున్నాడో తెలియక అభిమానులు అతలాకుతలం అవుతున్నారు.

ఇప్పటికే దాసరి నారాయణరావుతో పరమవీర చక్ర లాంటి ప్లాప్ సినిమా తీసి బాలయ్య బాబు అభిమానుల నుండి కామెంట్స్ ఎదుర్కోంటుంటే, తాజాగా బాపు దర్శకత్వంలో నటిస్తున్న శ్రీరామరాజ్యం కూడా ప్లాప్ ఐతే అభిమానులు బాలయ్యబాబుని క్షమిస్తారంటారా.. ఇది ఇలా ఉంటే ఈరోజు ప్రముఖ సిని రచయత, నిర్మాత ముళ్ళపూడి వెంకట రమణ చెన్నై లోని ఆయన స్వగృహంలో తుది శ్వాస వదిలారు. గత కొంతకాలం గా ఆయన అనారోగ్యంతో భాదపడుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలియజేసారు. ఆయన 1938 జూన్ 28 న ధవళేశ్వరం లో జన్మించారు.

రమణగా కంటే బాపు- రమణ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన వెంకట రమణ సినిమాలలోకి రాక ముందు ఆంధ్ర పత్రికలో పనిచేసారు. 'దాగుడుమూతలు' సినిమాతో పూర్తీ స్థాయి సిని రచయతగా మారారు. తన ప్రాణ స్నేహితుడు బాపు ను దర్శకుడిగా పరిచయం చేస్తూ 1967 లో 'సాక్షి' సినిమాతో నిర్మాతగా మారారు. ఆ తరవాత బాపు రమణలు సమిష్టి కృషితో తెలుగు దానానికి, తెలుగు సినిమాకు వన్నె తెచ్చారు.

ముళ్ళపూడి వెంకట రమణ నిర్మించిన ముత్యాల ముగ్గు, పెళ్ళిపుస్తకం, మిస్టర్ పెళ్ళాం తదితర చిత్రాలకు నంది అవార్డులు దక్కించుకున్నారు. 1987 లో రాష్ట్ర ప్రభుత్వం నుండి రఘుపతి వెంకయ్య అవార్డు స్వీకరించారు. కేవలం సిని రచన మాత్రమే కాకుండా 'బుడుగు' వంటి చిన్న పిల్లల సాహిత్యాన్ని కూడా రచించారు. స్వాతి వార పత్రికలో 'కోతి కొమ్మచ్చి' అనే శీర్షిక ద్వారా తన ఆత్మ కధను తెలుగు ప్రేక్షకులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఆయన బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'శ్రీ రామ రాజ్యం' చిత్రానికి రచయితగా వ్యవహరించారు. శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ మృతి పట్ల సిని పరిశ్రమ సంతాపం తెలియ పరిచింది.

English summary
Mullapudi and Bapu together entered the film industry, with Bapu wielding megaphone and Ramana penning the story, screenplay and dialogues. Bapu started directing in 1967 in association with Ramana and the movies under his direction are famous for classical and lyrical charm. Both of them together worked for 49 films, social and mythological; in Telugu and Hindi. Mullapudi is fond of comedy and hence most of his dialogues are quite hilarious.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu