»   » ఎంత త్వరగా వచ్చాడో అంతే త్వరగా... జీబ్రాన్ ఇక టాలీవుడ్ లో కనిపించడా??

ఎంత త్వరగా వచ్చాడో అంతే త్వరగా... జీబ్రాన్ ఇక టాలీవుడ్ లో కనిపించడా??

Posted By:
Subscribe to Filmibeat Telugu

కమల్ హాసన్ లాంటి వాడు ఒక యువ సంగీత దర్శకుడి ప్రతిభకు ముగ్ధుడైపోయి.. వరుసగా తాను చేయబోయే నాలుగు సినిమాలకు అతణ్నే మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకోవడం అన్నది అరుదైన విషయం. తమిళ మ్యూజికల్ సెన్సేషన్ జిబ్రాన్ ఈ అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. కమల్ తో అతను వరుసగా విశ్వరూపం-2.. ఉత్తమ విలన్.. పాపనాశం.. చీకటి రాజ్యం సినిమాలకు పని చేశాడు.

ఈ సినిమాలకు చేస్తుండగానే తెలుగులోనూ మంచి మంచి అవకాశాలు పట్టేశాడు జిబ్రాన్. తెలుగులో అతడి తొలి సినిమా 'రన్ రాజా రన్' మ్యూజికల్ గా సూపర్ హిట్. తర్వాత 'జిల్' సినిమాతోనూ పర్వాలేదనిపించాడు. టాలీవుడ్ లో ప్రతిభ లేకపోయినా చలామణీ అయిపోవచ్చు అదృష్టం వుంటే. కానీ డిసిప్లిన్ లేకపోయినా, కాంట్రావర్సీలకు తావిచ్చినా, పక్కన పెట్టేస్తారు. అందుకే ఎంత ఎదిగినా ఒదిగి వుండడం అన్నది టాలీవుడ్ జనాలు నేర్చుకునే సూత్రం. లోపల ఒరిజినల్ ను అలాగే వుంచుకుని, బయటకు ఎంత నాన్ కాంట్రా వర్సీగా వుండాలో అంతా వుంటారు. కానీ యంగ్ మ్యూజిక్ డైరక్టర్ జిబ్రాన్ వ్యవహారం ఇందుకు రివర్స్ లో నడుస్తోంది.

అంచనాల్ని అందుకోలేకపోయాడు:

అంచనాల్ని అందుకోలేకపోయాడు:

జిబ్రాన్ తన మీద పెట్టుకున్న అంచనాల్ని అందుకోలేకపోయాడు. ఈ ఏడాది జిబ్రాన్ చేసిన ‘బాబు బంగారం' కానీ.. ‘హైపర్' కానీ.. ఆకట్టుకోలేకపోయాయి. ఈ దెబ్బకు జిబ్రాన్ కు మళ్లీ ఇంకో అవకాశం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. అంతే కాదు సినిమా రంగంలో చాలా లింక్ లు వున్న నిర్మాత అనిల్ సుంకరతో కాస్త సున్నం పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.

పాటలు లేట్ చేయడంతో:

పాటలు లేట్ చేయడంతో:

అనిల్ సుంకర కు ఇటు ఎకె ఎంటర్ టైన్ మెంట్స్, అటు 14 రీల్స్, ఇంకా అభిషేక్ పిక్చర్స్, అటు వారాహి సంస్థలతో ఆర్థిక సంబంధాలో, స్నేహ సంబంధాలో వున్నాయి. హైపర్ సినిమాకు 14 రీల్స్ సంస్థను జిబ్రాన్ చాలా ఇబ్బంది పెట్టినట్లు టాక్. తానేదో టూర్ వేసుకోవడంతో పాటలు లేట్ చేయడంతో, రీరికార్డింగ్ మణిశర్మతో చేయించారు.

ఇన్ పుట్స్ ఇచ్చి:

ఇన్ పుట్స్ ఇచ్చి:

ఇతగాడేమో, హీరో, డైరక్టర్, నిర్మాత అందరూ ఇన్ పుట్స్ ఇచ్చి, ఇటు అటు లాగేస్తున్నారని, అందుకే ఇక ఆ సంస్థలో చేయనని తెగేసి చెప్పేసాడట. దాంతో ఎకె సంస్థలో రాజ్ తరుణ్ చేసే సినిమా అనూప్ రూబెన్స్ కు వెళ్లిపోయింది. పోనీ ఈ వ్యవహారం ఇలా సైలెంట్ గా వుండిపోతే బాగుండేది.

నిర్మాతదే తప్పనట్లు:

నిర్మాతదే తప్పనట్లు:

అలా కాకుండా నిర్మాతదే తప్పనట్లు ఫీలర్లు బయటకు వదిలారు. దాంతో నిర్మాణ వర్గాలు, అసలు కథ ఇదంటూ అట్నుంచి ఫీలర్లు వదలటం మొదలు పెట్తారు. వెరసి ఇదంతా ఓ మెస్ గా తయారయ్యింది. పైగా హైపర్ సినిమాకు అడియో ఎంత మైనస్ అన్నది అందరికీ తెలిసిపోయింది కూడా.

ఎవరేం చేయలేరు:

ఎవరేం చేయలేరు:

దానా దీనా జరిగింది ఏమిటంటే..దీనివల్ల తెలుగులో అనవసరంగా జిబ్రాన్ కు అవకాశాలు పూర్తిగా తగ్గి పొయాయి . అయినా నాకేంటి..నా టాలెంట్ నాకుంది..అనుకుంటే ఎవరేం చేయలేరు. ఇక్కడ టాలెంట్ తో పాటు టైమ్ కి పనిచేయడం, డిసిప్లిన్ కూడా ముఖ్యమే. ప్రస్తుతం తెలుగులో ఒక్కటంటే ఒక్క సినిమా చేతిలో లేదు జిబ్రాన్ కు.

మ్యూజిక్ డైరెక్టర్ల కొరత :

మ్యూజిక్ డైరెక్టర్ల కొరత :

తమిళంలో పరిస్థితి పర్వాలేదు. తెలుగులో పెద్ద సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ల కొరత ఉంది. అందరికీ దేవిశ్రీనే కావాలి. ప్రత్యామ్నాయాలు తగ్గిపోయాయి. తమన్.. అనూప్ రూబెన్స్ లాంటి వాళ్లు గ్యాప్ ను కొంత వరకే ఫిల్ చేస్తున్నారు. జిబ్రాన్ ఆరంభంలో చూపించిన ఊపు చూస్తే మున్ముందు పెద్ద పెద్ద అవకాశాలు పట్టేస్తాడనుకున్నారు. కానీ అతను ఆశించిన స్థాయిలో ఔట్ పుట్ ఇవ్వకపోవడంతో త్వరగా తెలుగు సినిమాల నుంచి కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది.

English summary
No offers for young musicdirector Gebran in Tollywood now, After Hyper movie with Ram Potineni
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu