»   » హీరో దిలీప్ కు నో బెయిల్, మళ్లీ పోలీసు కస్టడీ, త్రిశూర్ లో ఇద్దరినీ విచారణ, ఇక అంతేనా !

హీరో దిలీప్ కు నో బెయిల్, మళ్లీ పోలీసు కస్టడీ, త్రిశూర్ లో ఇద్దరినీ విచారణ, ఇక అంతేనా !

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొచ్చి: మాలీవుడ్ ప్రముఖ హీరో దిలీప్ కు బెయిల్ ఇవ్వడానికి అంగమాలి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు నిరాకరించింది. దిలీప్ కు బెయిల్ ఇవ్వరాదని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దిలీప్ ను మళ్లీ వివచారించి పూర్తి వివరాలు సేకరించడానికి అవకాశం ఇవ్వాలని పోలీసులు మనవి చేశారు.

హీరో దిలీప్ ఇల్లు క్లోజ్: కుమార్తె మీనాక్షిని హాస్టల్ కు పంపించిన ఆమె తల్లి మంజు వారియర్ !

నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో నటుడు దిలీప్ కు సంబంధం ఉందని, ప్రధాన నిందితుడు సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సునీని కలిసి విచారణ చేస్తే పూర్తి వివరాలు బయటకు వస్తాయని, అందుకు అవకాశం ఇవ్వాలని పోలీసులు కోర్టులో మనవి చేశారు.

బెయిల్ ఇవ్వలేము

బెయిల్ ఇవ్వలేము

పోలీసులు తెలిపిన వివరాలు పరిశీలించిన న్యాయస్థానం దిలీప్ కు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. అయితే దిలీప్ కు బెయిల్ ఇవ్వాలని ఆయన న్యాయవాది రామ్ కుమార్ చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. దిలీప్ ను పోలీసు కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

దిలీప్ ను తీసుకెళ్లండి

దిలీప్ ను తీసుకెళ్లండి

శనివారం సాయంత్రం 5 గంటల లోపు దిలీప్ ను కోర్టు ముందు హాజరుపరచాలని న్యాయస్థానం పోలీసులకు సూచించింది. ఇప్పటికే పోలీసులు కేరళలోని ఎర్నాకులం, త్రిశూర్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు దిలీప్ ను తీసుకెళ్లి విచారణ చేశారు.

Dileep Always Tried To Take Revenge on that Actress | Filmibeat Telugu
నటిపై లైంగిక దాడి జరిగిన ఊరిలో !

నటిపై లైంగిక దాడి జరిగిన ఊరిలో !

దిలీప్, పల్సర్ సునీని కలిపి త్రిశూర్ లోని అత్తణి ( త్రిశూర్ కు 25 కిలో మీటర్ల దూరంలో నటిపై లైంగిక దాడి జరిగిన ప్రాంతం) ప్రదేశానికి తీసుకెళ్లి విచారణ చెయ్యాలని పోలీసు అధికారులు సిద్దం అయ్యారు. ఇదే సందర్బంలో దిలీప్ ముందు పల్సర్ సునీ నోరు విప్పే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు.

పోలీసు విచారణకు దిలీప్ !

పోలీసు విచారణకు దిలీప్ !

దిలీప్ పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తున్నాడా ? లేదా ? అనే విషయం పోలీసులు బయటకు చెప్పడం లేదు. శనివారం సాయంత్రం 5 గంటల లోపు దిలీప్ నుంచి పూర్తి సమాచారం సేకరిస్తామని కేరళ పోలీసు అధికారులు అంటున్నారు.

హీరో దిలీప్ ఇక అంతేనా ?

హీరో దిలీప్ ఇక అంతేనా ?

నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో హీరో దిలీప్ పీకల్లోతుల్లో చిక్కుకుపోయాడని ఓ పోలీసు అధికారి అంటున్నారు. దిలీప్, పల్సర్ సునీ, దర్శకుడు నాదిర్ షా తదితరులను ఒకే చోట కుర్చుపెట్టి విచారణ పూర్తి చేసి న్యాయస్థానంలో నివేదిక సమర్పించడానికి పోలీసు అధికారులు సిద్దం అయ్యారు.

English summary
The Angamaly judicial magistrate court extended police custody of actor Dileep by a day on Friday. Dileep was produced before the magistrate only to be sent back to police custody till 5 PM on Saturday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu