twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి పాసులు అమ్మడం లేదు, వాళ్లను తీసుకురావొద్దు: రాజమౌళి

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బాహుబలి ఆడియో వేడుక శనివారం(జూన్ 13)న సాయంత్రం తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీ గ్రౌండ్స్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు గ్రాండ్‌గా చేస్తున్నారు. వాస్తవానికి మే 31న ఈ వేడుక హైదరాబాద్ లో జరుగాల్సి ఉండగా భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు అనుమతి ఇవ్వక పోవడంతో ఆడియో వేడుక వేదిక తిరుపతికి మార్చారు.

    కాగా...ఈ ఆడియో వేడుక నిర్వహణను రాజమౌళి బాహుబలి టీం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాజమౌళితో పాటు ప్రధాన యూనిట్ మెంబర్స్ అంతా అక్కడే తిష్టవేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆడియో వేడుకను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు పూర్తిస్థాయి వ్యూహంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా భద్రతా ప్రణామాల విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

    None of the passes are for sale: Rajamouli

    బాహుబలి ఆడియో వేడుక ఏర్పాట్ల గురించి రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ...బాహుబలి ఆడియో వేడుకు సంబంధించిన ఏర్పాట్లు పోలీస్ డిపార్టుమెంట్, బాహుబలి టీం సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆడియో వేడుకకు చిన్న పిల్లలను, పెద్ద వారిని తీసుకురావొద్దని రాజమౌళి అభిమానులకు విన్నవించారు.

    None of the passes are for sale: Rajamouli

    ఆడియో వేడుకకు సంబంధించిన పాసులు అమ్మడం లేదు. ఎవరైనా అమ్మినా కొనవద్దు. అలా కొన్నారంటే అవి డుప్లికేట్ పాసులే. ప్రభాస్ అభిమాన సంఘాలకు పాసులు స్వయంగా అందించాం. అభిమాన సంఘాల అధ్యక్షులు, రానా మేనేజర్స్ వద్ద పాసులు లభిస్తున్నాయి అని రాజమౌళి తెలిపారు.

    English summary
    "Even though Adequate arrangements are being made at the venue both by The police department and our teams, pls do not bring kids and elders. None of the passes are for sale. Pls do not buy from anyone as they may have been duplicated. Passes have been handed over to Prabhas fans Presidents and Rana managers. Get passes only through them for better access" Rajamouli said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X