For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘టెంపర్‌’లో ఐటం గర్ల్ లుక్ ఇదే(ఫొటో)

  By Srikanya
  |

  హైదరాబాద్ : పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు 'టెంపర్‌‘. ఎన్టీఆర్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరిగింది. ఈ చిత్రంలో ఐటం సాంగ్ ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఐటెం సాంగ్స్‌కి క్రేజీ తెచ్చిన డెర్టెక్లర్లలో ఒకరు పూరిజగన్‌. టెంపర్‌ సినిమాలోనూ మొరాకోకు చెందిన మోడల్‌ నోరా ఫతేహి తో ఐటెం సాంగ్‌ను తెరకెక్కిస్తున్నారు పూరి. ఆమెపై చిత్రీకరించి సాంగ్ లో స్టిల్ ఇది.

  https://www.facebook.com/TeluguFilmibeat

  ఈ ఐటం సాంగ్‌లో అమ్మడు దుమ్మురేపడం ఖాయమంటున్నారు చిత్ర యూనిట్‌ సభ్యులు. టెంపర్‌ చిత్రానికి ఈ పాటే హైలెట్‌ అవుతుందని టాక్‌. సాంగ్‌కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్‌ వేసి తీసారు. ఎంత తొందరగా షూటింగ్‌ ముగిస్తే అంత తొందరగా సినిమాను విడుదల చేయవచ్చని పూరి అనుకుంటున్నారు. బండ్ల గణేష్‌ నిర్మాణ సారధ్యంలో సాగుతున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

  లేటెస్ట్ ఇన్ఫో...

  Nora Fatehi's sultry avatar in Temper!

  ఆడియోని ఈనెల 18న విడుదల చేయడానికి నిర్మాత బండ్ల గణేష్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. న్యూఇయర్‌ వేడుకగా ప్రేక్షకులకు టెంపర్‌ టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్‌కు యుట్యూబ్‌లో మంచి ఆదరణతో పాటు ఒక్కరోజులోనే రెండు లక్షలకుపైగా క్లిక్స్‌ వచ్చాయంటే అభిమానులు ఏ రేంజ్‌లో ఈ సినిమాను ఆశిస్తున్నారో అర్ధమౌతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లోని కొన్ని లోకేషన్లలో ఎన్టీఆర్‌-కాజల్‌లపై దర్శకుడు పూరిజగన్‌ తెరకెక్కిస్తున్నాడు.

  ‘ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం. అదే ఒకడు మీదడిపోతే దండయాత్ర'.. ఇది దయాగాడి దండయాత్ర'అంటూ ఎన్టీఆర్‌ చెప్పే డైలాగ్‌తో విడుదల చేసిన టీజర్‌కి చక్కని స్పందన వస్తోంది. ఎన్టీఆర్‌ లుక్‌, స్టైలింగ్‌ కొత్తగా ఉందని ప్రేక్షకులు, అభిమానులు చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. టీజర్‌ రిలీజ్‌ తరువాత సినిమాకి మరింత క్రేజ్‌ పెరిగింది'' అని బండ్ల గణేశ్‌ అన్నారు.

  నూతన సంవత్సరం కానుకగా విడుదల చేసిన టీజర్‌కు వస్తోన్న రెస్పాన్స్‌ గురించి నిర్మాత మాట్లాడుతూ ‘‘ఎన్టీఆర్‌ సిక్స్‌ప్యాక్‌తో విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి ఎంత రెస్పాన్స్‌ వచ్చిందో అంతకు మించి టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇందులో ఎన్టీఆర్‌ క్యారెక్టరైజేషన్‌ చాలా డిఫరెంట్‌గా, పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఎన్టీఆర్‌, పూరి, నా కెరీర్‌లో ‘టెంపర్‌' పెద్ద హిట్‌ అవుతుంది. ఈ నెల 20 వరకు జరిగే షెడ్యూల్‌తో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. మరో పక్క పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి మొదటివారంలో సినిమాను విడుదల చేస్తాం'' అని అన్నారు.

  కాజల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్‌ కె నాయుడు, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్‌, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

  English summary
  Nora Fatehi who is a Canadian model of Moroccan origin got the opportunity to shake her leg with Jr NTR in 'Temper' item song.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X