»   » సెక్స్ బాంబ్ ముద్ర పడదు: విద్యా బాలన్

సెక్స్ బాంబ్ ముద్ర పడదు: విద్యా బాలన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్నసినిమాలో హాట్ పెర్పార్మెన్స్ కు తెరలేపిన బాలీవుడ్ తార విద్యా బాలన్ తనకు శృంగార తారగా ముద్ర పడదని, ఒక వేళ పడినా తనకు భయమేమి లేదని నిర్మొహమాటం చెబుతోంది. సిల్క్‌స్మితగానే నటిస్తున్నానని..పాత్రకు తగిన విధంగానే తన పెర్ఫార్మెన్ష్ ఉంటుందన్నారు. కొందరు హీరోయిన్లలా తానేమీ కావాలని హద్దలు దాటడం లేదని స్పష్టం చేస్తోంది. ఇది నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర కాబట్టే సన్ని వేశాలకు తగినట్లు కొన్ని చోట్ల బోల్డ్ గా నటిస్తున్నానని, సెక్స్ సింబల్‌గా ముద్రపడదని ఆమె అన్నారు.

దక్షిణాదిలో శృంగార తారగా ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన సిల్క్‌స్మిత జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న 'ది డ ర్టీ పిక్చర్" చిత్రంలో విద్యాబాలన్ నటిస్తున్నారు. మిలన్ లుత్రియా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయలక్ష్మి (సిల్క్‌స్మిత) పాత్రలో విద్యాబాలన్ నటిస్తోంది. ఏక్తా కపూర్ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నసీరుద్దీన్‌షా, ఇమ్రాన్ హష్మీ, తుషార్ కపూర్‌లు నటించారు. స్మిత జన్మదినం సందర్భంగా డిసెంబర్ 2 తేదిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి విద్యపై ఎలాంటి ముద్ర పడబోతోందో? సినిమా విడుదలైతే గానీ తెలీదు.

English summary
vidya balan says..i'm Not to be seal as sex bomb after releasing dirty picture.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu