»   » 1.10 కోట్లు ఎగ్గొట్టారు :ఎన్టీఆర్‌ సహా నాన్నకు ప్రేమతో టీమ్ కు నోటీసులు

1.10 కోట్లు ఎగ్గొట్టారు :ఎన్టీఆర్‌ సహా నాన్నకు ప్రేమతో టీమ్ కు నోటీసులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాన్నకు ప్రేమతో సినిమా విషయం లో కావాలనే కొన్ని లొసుగులని వాడుకొని పన్ను ఎగ్గొట్టారంటూ ఎన్టీఆర్‌ పై ఆరోపణలు వస్తున్నాయి. విదేశాల్లో సినిమా షూటింగ్‌ తీశాము కాబట్టి అది సేవల ఎగుమతి కిందికి వస్తుందని చూపిస్తూ ఎన్టీఆర్‌ పన్ను చెల్లించలేదని కాగ్‌ తన నివేదికలో పేర్కొంది. వినోద రంగంలో సేవా పన్నుల చెల్లింపుల్లో జరిగిన అవకతవకలపై కాగ్‌ అధ్యయనం చేసి రూపొందిన్దించిన ఈ నివేదికను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

'నాన్నకు ప్రేమతో' సినిమాలో హీరోగా నటించిన ఎన్టీఆర్‌.. లండన్‌కు చెందిన వైబ్రంట్‌ విజువల్‌ లిమిటెడ్‌ ప్రొడ్యూసింగ్‌ కంపెనీ నుంచి 2015లో రూ.7.33 కోట్లు పారితోషికంగా తీసుకున్నారని కాగ్‌ ఆ నివేదికలో పేర్కొంది. ఎక్స్‌పోర్ట్‌ ఆఫ్‌ సర్వీసు కింద పరిగణించి తాను చెల్లించాల్సిన రూ. 1.10 కోట్ల సర్వీసు పన్ను మినహాయించారని వివరించింది.

Notices issued to crew of Telugu film 'Nanaku Prema Prematho'

దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ వివరణ కోరగా.. జూనియర్‌ ఎన్టీఆర్‌కు షోకాజ్‌ నోటీసు ఇవ్వబోతున్నామని ఆర్థిక శాఖ అనుబంధంగా ఉండే రెవెన్యూ విభాగం సమాధానం ఇచ్చింది. బాలీవుడ్‌లోనూ ఇదే తరహాలో.. ''ఏ దిల్‌ హై ముష్కిల్‌'' హిందీ సినిమాను న్యూయార్క్‌లో చిత్రీకరించామని చూపిస్తూ ఆ సినిమా హీరోరూ. 83.43 లక్షల పన్ను మినహాంపులు పొందిన విషయాన్ని కాగ్‌ గుర్తించింది. అయితే దీనిపై ఆర్థిక శాఖను వివరణ కోరగా..ఆ సినిమా షూటింగ్ చాల భాగం విదేశాల్లో జరిగింది..అందుకే పన్ను మినహాయింపు ఇచ్చామని తెలిపింది. కానీ మన జూనియర్ సినిమా విషయం లో మాత్రం పన్ను కట్టి తీరాల్సిందే అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

English summary
Acting on a report tabled by CAG (Comptroller & Auditor General), the national auditor, the Central Revenue department is gearing up to serve show cause notice to NTR Jr on evading tax to the tune of Rs 1.10 crore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu