»   » ఆ పాటంటే ఉన్న ఇష్టంతోనే రిమిక్స్‌ చేశాం:ఎన్టీఆర్

ఆ పాటంటే ఉన్న ఇష్టంతోనే రిమిక్స్‌ చేశాం:ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : ''వేటగాడు సినిమాలో తాతయ్యగారి పాట 'ఆకుచాటు పిందె తడిసె' నా ఫేవరెట్‌. చినుకులు మొదలవ్వగానే ఆ పాటే... నా మనసులో పరుగెడుతూ ఉంటుంది. ఎన్టీఆర్‌ - శ్రీదేవి కాంబినేషన్‌ చూడముచ్చటగా ఉంటుంది. చిత్రీకరించిన విధానం కూడా నాకు బాగా నచ్చుతుంది. ఆ పాటంటే ఉన్న ఇష్టంతోనే 'అల్లరి రాముడు'లో 'రెండు వేల రెండు వరకూ..'గా రిమిక్స్‌ చేశాం. దానికీ మంచి స్పందనే వచ్చింది'' అంటూ ఎన్టీఆర్ వాన పాట గురించి గుర్తు చేసుకున్నారు.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ రామయ్య వస్తావయ్యా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రామయ్యా వస్తావయ్యా'లో ఎన్టీఆర్‌ని ఓ డైనమేట్‌లా చూపించబోతున్నట్లు నిర్మాత దిల్ రాజు చెప్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. హరీష్‌శంకర్ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. సమంతా, శృతిహాసన్ హీరోయిన్స్

దిల్ రాజు మాట్లాడుతూ- ''ఎన్టీఆర్ ఇమేజ్‌ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టే సినిమా అవుతుంది. తన గత చిత్రాలకు ధీటుగా హరీష్‌శంకర్ ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఇటీవలే మైసూర్‌లో ఎన్టీఆర్, సమంత, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను, రెండు పాటలను చిత్రీకరించాం. నేటి నుంచి హైదరాబాద్‌లో షెడ్యూల్ మొదలైంది. అంచనాలను మించేలా ఉంటుందీ సినిమా'' అని చెప్పారు.


అలాగే... ''బృందావనంలో ఎన్టీఆర్‌ని సరికొత్తగా చూపించాం. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్‌ని వైవిధ్యభరితమైన పాత్రలో ఆవిష్కరించబోతున్నాం. ఆయన అభిమానులు ఏం కోరుకొంటున్నారో అవన్నీ ఈ కథలో మేళవించాం. ఎన్టీఆర్‌, సమంతలపై తెరకెక్కించిన సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి''అన్నారు.

'బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి కొడతా..నన్ను అలా పిలవాలంటే ఓ అర్హత వుండాలి. లేదా నా అభిమాని అయివుండాలి...అంటూ టీజర్‌లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌తో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా వుంటుందని నిర్మాత హామీ ఇస్తున్నారు.

ఎన్టీఆర్ సెంటిమెంట్‌గా భావించే సెప్టెంబర్ 17న ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాత దిల్‌రాజు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ విద్యార్థి నాయకుడిగా కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, ఛాయాక్షిగహణం: చోటా కె. నాయుడు, ఎడిటింగ్: అవినాష్ సైలా, స్క్రీన్‌ప్లే: రమేష్‌డ్డి, వేగేశ్న సతీష్.

English summary

 jr.NTR says that he is very much intrested in Veta Gaadu Song. So he remixed that song in his Allari Raamudu film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu