»   »  'ఎన్టీఆర్' కోసం నిమ్మకూరు నుంచి, నందమూరి ఫాన్స్ కు పండగే, బాలయ్య రచ్చ!

'ఎన్టీఆర్' కోసం నిమ్మకూరు నుంచి, నందమూరి ఫాన్స్ కు పండగే, బాలయ్య రచ్చ!

Subscribe to Filmibeat Telugu
Balakrishna's Visual Treat For Fans అధిరిపోనున్న నందమూరి ప్లాన్..

ఎన్టీఆర్ బయోపిక్ భారీ స్థాయిలో పార్రంభం అయ్యేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఎన్టీఆర్ జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించాలనే కోరికతో ఈ చిత్రానికి బాలకృష్ణ స్వయంగా పూనుకున్నారు. భారీ స్థాయిలో అభిమానుల అంచనాలకు తగ్గకుండా ఈ చిత్రం రూపు దిద్దుకోబోతోంది. ఆరంభమే అదిరేలా ఉండడానికి బాలకృష్ణ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శకుడు తేజ ఈ చిత్రాన్ని రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి సమందించిన వార్త నందమూరి అభిమానులు పండగ చేసుకునే విధంగా ఉంది.

ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య

ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటించబోతున్నాడు. ఈ విషయమే నందమూరి అభిమానుల్లో అంచనాలు పెంచేస్తోంది.

 ఎన్టీఆర్ చిన్ననాటి నుంచి

ఎన్టీఆర్ చిన్ననాటి నుంచి

ఎన్టీఆర్ చిన్నతనంలో చోటుచేసుకున్న సంఘటనల నుంచి అయన జీవితంలో కీలక అంశాలన్నింటినీ ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

బాలయ్య 62 గెటప్స్ లో

బాలయ్య 62 గెటప్స్ లో

బాలకృష్ణ ఈ చిత్రంలో మొత్తం 62 గెటప్స్ లో కనిపిస్తారట. ప్రతి చిన్న అంశాన్ని రాజీపడకుండా చిత్రీకరించాలని బాలయ్య భావిస్తున్నాడు.

ముహూర్తం ఖరారు

ముహూర్తం ఖరారు

ఎన్టీఆర్ బియోపిక్ చిత్ర లాంచింగ్ కి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 29 న రామకృష్ణ సుడియో లో ఈ వేడుక జరగబోతోంది.

 ఎన్టీఆర్ స్వగ్రామం నుంచి భారీగా

ఎన్టీఆర్ స్వగ్రామం నుంచి భారీగా

ఈ వేడుక నందమూరి అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు గుర్తుంచుకునేలా జరపాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు నుంచి అభిమానులని ఈ వేడుకకు బాలకృష్ణ ఆహ్వానించారు. అలాగే తన తల్లి బసవతారకం స్వగ్రామం అయిన కొమరవోలులో కూడా అభిమానులని ప్రత్యేకంగా బాలయ్య ఆహ్వానించారు.

అభిమానులకు ప్రత్యేక ఆహ్వానాలు

అభిమానులకు ప్రత్యేక ఆహ్వానాలు

రెండు తెలుగురాష్ట్రలో అభిమానులకు బాలయ్య ప్రత్యేక ఆహ్వానాలు పంపారు.

English summary
NTR biopic launch on March 29th. Balakrishna doing big arrangements for the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu