»   » చిరంజీవి బాటలోనే యంగ్ టైగర్: అబిమానుల పై ఆపరేషన్ ఆకర్ష్

చిరంజీవి బాటలోనే యంగ్ టైగర్: అబిమానుల పై ఆపరేషన్ ఆకర్ష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

గత కొంత కాలం గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ఒడిదుడుకుల్లోనే సాగుతోంది. మంచి హిట్ లే వచ్చినా అవి ఎన్టీఆర్ రేంజ్ కాదు. నాన్నకు ప్రేమతో మంచి టాక్ రాబట్టుకున్నట్టే కానీ నందమూరి ఫ్యామిలీ లో వచ్చిన చీలిక కారణం గా అభిమానులు కూడా విడిపోవటం తో ఫాలోయింగ్ మునుపటంత స్ట్రాంగ్ గా లేదు.

ఈ విశయం ఎన్టీఆర్ కూడా ఈ మధ్యనే గమనించాడు. తనకంటూ ఉన్న ఫాలోయింగ్ నీ తన అభిమానులనీ పెంచుకోకపోతే తన కెరీర్కి గట్టి దెబ్బ ఎదురౌతుందని గ్రహించిన యంగ్ టైగర్ ఇప్పుడు ఫాలోయింగ్ ని పెంచుకునే పనిలో పడ్డాడు. నిజానికి నందమూరి ట్యాగ్ తోనే వచ్చినా ఇప్పుడు ఇక తనకంటూ ఒక ఇమేజ్ ఉండాక్లని కోరుకుంటున్నాడు... అందుకే అభిమానులకి దగ్గరయ్యే ప్రయత్నాలు ఎక్కువ చేసాడు...

NTR decided to Spend time with Fans after Shooting

సినిమా రిలీజయ్యాక ఏదో ఒకరిద్దరు అభిమానుల్ని కలిసే అలవాటున్న తారక్‌ ఇప్పుడు షూటింగ్‌ స్పాట్లో కూడా ఫాన్స్‌ని కలిసి వారితో ఫోటోలు దిగుతున్నాడు. దీని కోసం అతను రోజూ కొద్ది సమయం కేటాయిస్తున్నాడు. ఇది తెలుసుకున్న నందమూరి అభిమానులు మళ్లీ ఎన్టీఆర్‌కి చేరువ అవుతున్నారు.

ఎలాగైనా యంగ్ టైగర్ ని కలుసుకోవాలంటూ బారులు తీరుతున్నారు. గతంలో ఇలా తరచుగా ఫాన్స్‌ని కలుసుకుని తన ఫాన్‌ బేస్‌ని మరింత పెంచడానికి చిరంజీవి నిత్యం తపించేవారు. షూటింగ్‌ అయిపోయాక కూడా ఫాన్స్‌ కోసం గంట సమయం కేటాయించి అందరితో ఫోటోలు దిగేవారు.

ఇప్పుడు ఎన్టీఆర్‌ కూడా చిరంజీవిని ఫాలో అయిపోతూ ఫాన్స్‌ మనసులు దోచేస్తున్నాడు. ఈ మధ్యనే చెన్నై లో జనతా గ్యారేజ్ షూటింగ్ లోనే ఎన్టీఆర్‌ లో స్పష్టమైన మార్పు కనిపించింది. దాదాపు ఒకే రోజు లో మూడు గంతల పాటు అభిమానుల కోసం కేటాయించి. వారితో మాట్లాడుతూ, ఫొటోలు దిగుతూ గడిపాడు యంగ్ టైగర్...

English summary
Young Tiger NTR fallowing chiranjeevi who is gave more attention on his fans.., so NTR decided to spend more Time with his fans in "janatha garage" sets after Shooting
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu