»   » తాత ఆశయాలతో ముందుకు: విచార వదనంలో జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ (ఫోటోస్)

తాత ఆశయాలతో ముందుకు: విచార వదనంలో జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సీనియర్ ఎన్టీఆర్ 21 వర్థంతి సందర్భంగా బుధవారం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు భారీగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుంటున్నారు. అక్కడున్న ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్నారు.

సీనియర్ ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ తన ఇద్దరు కుమారులైన జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ మనల్ని విడిచి వెళ్లిపోయి ఏళ్లు గడుస్తూనే ఉన్నాయి, కాలం గడిచే కొద్దీ ఆయన లేని భావం మరింత ఎక్కువ కలుగుతూనే ఉందని అన్నారు. మహానుభావులు మనల్ని భౌతికంగా విడిచివెళ్లిపోయినా.. వారు చేసిన మంచి పనులు మన చుట్టూనే ఉంటాయని చెప్పారు.

తాత ఆత్మ అక్కడే..

తాత ఆత్మ అక్కడే..

తాత ఆత్మ తెలుగు రాష్ట్రాల ప్రజల మదిలోనే ఉంటుందని జూ ఎన్టీఆర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఆయన తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి అని జూ ఎన్టీఆర్ ఈ సందర్భంగా కొనియాడారు.

తాత ఆశయాలతోనే

తాత ఆశయాలతోనే

మహిళలు, ప్రజల కోసం ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని అన్నారు. ఆయన తమకు మంచి మార్గాన్ని చూపారని, ఆయన ఆశయాలతోనే ముందుకు సాగుతామని ఎన్టీఆర్ తెలిపారు.

మహోన్నతమైన వ్యక్తి

మహోన్నతమైన వ్యక్తి

హరికృష్ణ మాట్లాడుతూ... ఎన్టీఆర్‌ గురించి మాట్లాడాలంటే సమయం చాలదని అన్నారు. ఆయన మహోన్నతమైన వ్యక్తని, ఆయన ఆశయాలను కొనసాగిస్తామన్నారు.

ఎన్టీఆర్ పత్యేకం

ఎన్టీఆర్ పత్యేకం

దేశంలో ఎందరో మహానుభావులున్నారు కానీ, ఎన్టీఆర్‌కు ప్రత్యేకత ఉందని అన్నారు. ఆయన సంస్కరణల ద్వారా రాష్ట్ర దిశనే కాదు, దేశ దిశను కూడా మార్చిన మహా మనిషి అని హరికృష్ణ అన్నారు.

విచార వదనంలో

విచార వదనంలో

ఎన్టీఆర్ ఘాట్ లోని తాత సమాధి వద్ద విచార వదనంలో జూ ఎన్టీఆర్. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తాతయ్యతో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

మీడియాతో

మీడియాతో

ఎన్టీఆర్ ఘాట్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. ఆయన తమకు మంచి మార్గాన్ని చూపారని, ఆయన ఆశయాలతోనే ముందుకు సాగుతామని తెలిపారు.

బాబాయ్ తో

బాబాయ్ తో

ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాబాయ్ తో కలిసి కళ్యాణ్ రామ్. ఘాట్ వద్దకు భారీగా ఎన్టీఆర్ అభిమానులు చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ఘట్టిబందోబస్తు ఏర్పాటు చేసారు.

మహనీయుడు

మహనీయుడు

సీరియర్ ఎన్టీఆర్ తెలుగు జాతి ఎప్పటికీ మరిచిపోలేని మహనీయుడు, ఆయన తెలుగు జాతి కీర్తి పతాకాలను ఎగరవేసిన గొప్ప నాయకుడు,నటుడు అని పలువురు కొనియాడారు.

కాలం గడిచే కొద్దీ

కాలం గడిచే కొద్దీ

కాలం గడిచే కొద్దీ ఆయన లేని భావం మరింత ఎక్కువ కలుగుతూనే ఉందని అన్నారు. మహానుభావులు మనల్ని భౌతికంగా విడిచివెళ్లిపోయినా.. వారు చేసిన మంచి పనులు మన చుట్టూనే ఉంటాయని జూ ఎన్టీఆర్ అన్నారు.

మన చుట్టూ

మన చుట్టూ

మహానుభావులు మనల్ని భౌతికంగా విడిచివెళ్లిపోయినా.. వారు చేసిన మంచి పనులు మన చుట్టూనే ఉంటాయని, ఆయన్ను ఎవరూ మరిచిపోరని జూ ఎన్టీఆర్ అన్నారు.

English summary
Sr Ntr Family Members Harikrishna, Jr NTR, Kalyan Ram Visit Ntr Ghat today occasion of NTR on 21st death anniversary. Check out photos.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu