»   » ఎన్టీఆర్ అభిమాని... చిన్నారి శ్రీనిధి మృతి

ఎన్టీఆర్ అభిమాని... చిన్నారి శ్రీనిధి మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి శ్రీనిధి(10) మృతి చెందింది. శ్రీనిధి స్వస్థలం వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం బందనపల్లి. జూనియర్‌ ఎన్టీఆర్‌ను చూడాలన్న శ్రీనిధి కోరిక మేరకు... ఇటీల జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆసుపత్రికివెళ్లి శ్రీనిధిని పరామర్శించిన విషయం తెలిసిందే.


మంగళవారం అర్థరాత్రి కూకట్ పల్లి రామ్ దేవ్ రావ్ ఆస్పత్రిలో చిన్నారి శ్రీనిధి కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నారి భౌతికకాయాన్ని ఆదివారం అర్ధరాత్రి సమయంలో రామ్ దేవ్ రావ్ ఆస్పత్రి నుంచి స్వస్థలమైన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బంధనపల్లికి తరలించారు. శ్రీనిధి గత రెండున్నర సంవత్సరాలుగా బ్లడ్ కేన్సర్ తో బాధపడిన విషయం తెలిసిందే.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Jr NTR

గతంలో జూనియర్ ఎన్టీఆర్ ను చూడాలని శ్రీనిధి కోరడంతో చిన్నారి కోరిక మీదట కూకట్ పల్లి రామ్ దేవ్ రావ్ ఆస్పత్రిలో జూనియర్ ఎన్టీఆర్ పరామర్శించిన విషయం అందరికి తెలిసిందే. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బంధనపల్లికి చెందిన శివాజీ, క్రాంతికుమారిలకు ముగ్గురు ఆడపిల్లలు ఉండగా, వాళ్లలో శ్రీనిధి పెద్దకుమార్తె. ఆమెకు ఆరాధ్య, అలేఖ్య అనే ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.

శ్రీనిధికి ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం. ఆయన నటించిన యమదొంగ సినిమా ఆమెకు బాగా గుర్తు. ఎన్టీఆర్ తనను చూసేందుకు వచ్చినప్పుడు కూడా యమదొంగ సినిమా గురించి ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించింది. తాను చిన్నారి శ్రీనిధి బాధను తీర్చలేకపోయినా.. కనీసం తనను చూడాలన్న ఆమె చివరి కోరికనైనా తీర్చగలిగానని ఎన్టీఆర్ ఆరోజు ఎంతగానో బాధపడ్డారు.

English summary
Srinidhi, a 10 year old girl, is suffering with cancer died toady. And the girl's wish is to meet her favourite hero NTR is fulfilled.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu