»   » ‘టెంపర్’....రెచ్చిపోయిన ఫ్యాన్స్, దాడి!

‘టెంపర్’....రెచ్చిపోయిన ఫ్యాన్స్, దాడి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జూ ఎన్టీఆర్ నటించిన 'టెంపర్' మూవీ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. సినిమాలో ఎన్టీఆర్ ఎంత కోపంగా తన టెంపర్ చూపించాడో....థియేటర్ బయట అభిమానులు కూడా అలాగే ప్రవర్తించారు. నిన్నమొన్నటి వరకు వరకు టెంపర్ ట్రైలర్స్ చూసిన ఎఫెక్టో ఏమో కానీ....కోపంగా ఊగిపోయారు.

తిరుపతిలోని జయశ్యాం థియేటర్ గురువారం ఉదయం జూ ఎన్టీఆర్ అభిమానులు దాడి చేశారు. టెంపర్ సినిమా ఆలస్యంగా ప్రదర్శిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, థియేటర్ అద్దాలు ధ్వంసం చేశారు. టెంపర్ చిత్రాన్ని అభిమానుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించాలని డిమాండ్ చేసినా థియేటర్ యాజమాన్యం నిరాకరించింది. దీంతో దయాగాడి సినిమా తమకు చూపిస్తుందనే దయ కూడా లేకుండా దాడి చేసారు. అభిమానుల వీరంగంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


NTR fans attack on Temper Theater

జూ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టెంపర్' చిత్రంపై విడుదలకు ముందు నుండే అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉండటంతో తొలి రోజు సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పైగా సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ రావడం కూడా కలిసొస్తుందని భావిస్తున్నారు.


ఎన్టీఆర్, కాజల్, ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్‌ కె నాయుడు, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్‌, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

English summary
NTR Fans attack on Temper Theater in Tirupathi.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu