twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అభిమాని ఫ్యామిలికీ రూ.5 లక్షలిచ్చిన ఎన్టీఆర్

    By Srinivas
    |

    హైదరాబాద్: బాద్‌ షా చిత్రం ఆడియో ఫంక్షన్‌లో జరిగిన తొక్కిసలాటలో వరంగల్ జిల్లాకు చెందిన రాజు అనే జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మృతి చెందిన విషయం తెలిసిందే. రాజు కుటుంబానికి తాను అండగా ఉంటానని జూనియర్ అప్పుడే ప్రకటించారు. ఇందులో భాగంగా సోమవారం ప్రస్తుతానికి తన వంతు సాయంగా రూ.5 లక్షలను మృతుడి కుటుంబానికి అందించారు.

    నిర్మాత బండ్ల గణేష్ కూడా మరో రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. దీనికి సంబంధించిన చెక్కులను ఎన్టీఆర్ అభిమాని రాజు తల్లి ఈశ్వరమ్మ మరియు కుటుంబ సభ్యులకు ఈ రోజు మధ్యాహ్నం అంద జేశారు. ఈ ఘటనపై అప్పుడే స్పందించిన నిర్మాత బండ్ల గణేష్ ఆదుకుంటానని హామీ ఇచ్చారు.

    "ఆనందోత్సవ సమయంలో అపశ్రుతి జరిగింది. ఈ దుర్ఘటన నన్ను కలచివేస్తోంది. చనిపోయిన బిడ్డ తల్లి నన్ను పెద్ద మనసుతో క్షమించాలి. వెంటనే వారి ఇంటికి వెళతాను. వారి అవసరాలను తీరుస్తాను'' అని పేర్కొన్నారు. ఈ రోజు బండ్ల గణేష్ రూ.5 లక్షలకు తోడుగా జూనియర్ మరో రూ.5 లక్షలు ఇచ్చారు. మొత్తం పది లక్షల రూపాయలను కుటుంబ సభ్యులకు అందజేశారు.

    "ఇలా జరగడం బాధాకరం. మృతుడి కుటుంబానికి మా నిర్మాత బండ్ల గణేష్ 5 లక్షలను అందజేస్తారు'' అని దర్శకుడు శ్రీనువైట్ల ఆడియో ఫంక్షన్ సమయంలోనే చెప్పారు. ఎన్టీఆర్ కూడా ఇది తెలిసిన వెంటనే ఫంక్షన్‌లో స్పందిస్తూ... "మా అమ్మకు నేను ఒక్కడినే కొడుకును. నాకు తోబుట్టువులు ఎవరూ లేరని బాధపడేవాడిని. కానీ అభిమానులందరూ నాకు తోబుట్టువులుగా మారారు. మీ అందరి పిడికిలి మధ్య గుండెను నేను. నా పిడికిలిలో ఉన్న గుండెకాయ మీరు. ఇవాళ 'బాద్‌షా' ఆడియో వేడుకకు వచ్చి తొక్కిసలాటలో ఓ అభిమాని చనిపోవడం అత్యంత బాధాకరం. ఇలాంటి ఘటనలు జరగకూడదు. కార్యక్రమానికి వచ్చిన వారందరూ క్షేమంగా ఇంటికెళ్లాలి. మీకోసం ఇంట్లో వారందరూ ఎదురుచూస్తుంటారు. మృతి చెందిన అభిమాని తల్లి కడుపుకోతని నేను తీర్చలేకపోవచ్చు. కానీ వారి బిడ్డగా నేను బాధ్యత తీసుకుంటా. ప్రతి ఒక్కరూ బాధ్యతగా, జాగ్రత్తగా ఇళ్లకు చేరుకోండి'' అని ఎన్టీఆర్ అన్నారు.

    English summary
    A die-hard fan of NTR from Warangal died in a stampede at audio launch of Baadshah. Thousands of fans thronged the event venue at Ramanaidu Cine Village in Nanakramaguda. In the ensuing stampede at the entrance of the venue, couple of fans was injured and they were immediately rushed to hospital for treatment. The fan from Warangal lost his life.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X