»   » ఎన్టీఆర్‌కు జై లవకుశ కలెక్షన్ల ఎఫెక్ట్.. 3 నెలలు ఎవరికీ కనిపించకుండా..

ఎన్టీఆర్‌కు జై లవకుశ కలెక్షన్ల ఎఫెక్ట్.. 3 నెలలు ఎవరికీ కనిపించకుండా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో ఎవరికీ దక్కని విజయాలు, గౌరవం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కే దక్కాయి. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి బాక్ల బస్టర్లతో దూసుకెళ్తున్నారు. తాజాగా జై లవకుశ రూపంలో మరో హిట్ ఖాతాలో చేరింది. అంతేకాకుండా బిగ్‌బాస్ తెలుగు కార్యక్రమం యంగ్ టైగర్‌కు ఎనలేని పేరు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో కెరీర్‌పై దృష్టి పెట్టి ఎన్టీఆర్ జాగ్రత్తగా అడుగులేస్తున్నాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ గురించి ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.

ఎన్టీఆర్ కొద్దిరోజులు బ్రేక్

ఎన్టీఆర్ కొద్దిరోజులు బ్రేక్

గత కొన్నాళ్లుగా విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొద్దిరోజులు బ్రేక్ తీసుకోవాలనుకొంటున్నారట. జై లవ కుశ సినిమా చేస్తూనే, బుల్లితెర కోసం బిగ్ బాస్ గేమ్ షో హోస్ట్ చేసాడు. బిగ్ బాస్ సూపర్‌గా హిట్ అయింది. జై లవకుశ కలెక్షన్లతో కుమ్మెస్తున్నది. ఈ ఆనంద సమయంలో ఫ్యామిలీకి దూరమైన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో గడిపేందుకు వెకేషన్‌కు ప్లాన్ చేస్తున్నారట.


 త్రివిక్రమ్ కోసం ఎన్టీఆర్ న్యూ లుక్

త్రివిక్రమ్ కోసం ఎన్టీఆర్ న్యూ లుక్

ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ తదుపరి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్నది. ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ సినిమా కోసం న్యూ లుక్ కోసం కసరత్తు చేస్తారట. అంతేకాకుండా మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకొనే అవకాశం ఉంది.


 యూరోప్ వెళ్లున్న ఎన్టీఆర్‌‌‌‌

యూరోప్ వెళ్లున్న ఎన్టీఆర్‌‌‌‌

ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని తన ఫ్యామిలీతో కలిసి ఎన్టీఆర్ యూరోప్ వెళుతున్నాడట . అక్కడ త్రివిక్రమ్ సినిమా కోసం న్యూ లుక్ కి వర్కవుట్ చేస్తూనే ఫ్యామిలీ కోసం ఫుల్లుగా టైమ్ కేటాయించాలని డిసైడ్ అయ్యాడట.


 నెక్ట్స్ ఇయర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్

నెక్ట్స్ ఇయర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్

వచ్చే ఏడాది ఆరంభంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభమవుతుందని సమాచారం. సో... ఎన్టీఆర్ 3 నెలలు బ్రేక్ అంటే వచ్చే ఏడాది జూన్, లేదా జూలై నెలలో త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు ప్రేక్షకులు వేచి చూడాల్సిందే.


English summary
Last couple of Months, Young Tiger NTR has been working on Jai Lava Kusa and Bigg Boss. These projects are finished recently. Now NTR is to work with director Trivikram for next project. Before this project, NTR going to Europe for 3 months vacation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu