»   » 'అదుర్స్‌'సినిమా ఎలా పుట్టిందంటే...ఎన్టీఆర్

'అదుర్స్‌'సినిమా ఎలా పుట్టిందంటే...ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఓ రోజు రచయిత కోన వెంకట్‌...వినాయక్‌ తో సరదాగా 'చారి-భట్టు' పాత్రల గురించి చెప్పాడు. వినాయక్‌ వెంటనే నాకు ఫోన్‌చేసి ఈ పాత్రల గురించి చెప్పాడు. నాక్కూడా నచ్చేసింది. వెంటనే కథ సిద్ధం చేయమని చెప్పాను. అలా చారి పాత్ర నుంచి 'అదుర్స్‌' సినిమా పుట్టింది అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. అలాగే తాము అనుకున్నట్లుగానే ఆ పాత్రలు పండాయని చెప్తూ...అది మేం ముందే ఊహించాం. బ్రహ్మానందం చేసిన భట్టు పాత్ర లేకపోతే, నేను పోషించిన చారి పాత్ర అస్సలు పండేది కాదు.

మేం ఇద్దరం కలిసి చేసిన సన్నివేశాలకు చప్పట్లే చప్పట్లు. చాలామంది నేను బ్రహ్మానందాన్ని డామినేట్‌ చేశానని చెబుతున్నారు. అందుకు నేను ఒప్పుకోను. బ్రహ్మానందాన్ని డామినేట్‌ చేయడం ఎవరివల్లా కాదు. నేను పుట్టిన దగ్గర్నుంచీ ఆయన నవ్విన్తూనే ఉన్నారు. మరో పాతికేళ్లయినా ఇలాగే నవ్విస్తూ ఉంటారు.

అలాగే ఈ చిత్రంలో చేసిన ద్విపాత్రాభినయం గురించి మాట్లాడుతూ...అలా చేయాలని ఎన్నుకున్న కథ కాదు ఇది. మొదట నాకు వినాయక్‌ ఎనిమిది కథలు చెప్పాడు. అన్నీ బాగున్నాయి. అయితే ఏదో అసంతృప్తి. నేను, వినాయక్‌ కలిసి సినిమా చేస్తున్నామంటే అభిమానులు చాలా అంచనాలు పెట్టుకుంటారు. ఆ అంచనాలను మించే కథ కోసం అన్వేషణ మొదలుపెట్టి, సుమారు 50 కథలు విన్నాం. అప్పుడు ఓకే చేసిన కథ ఇది అన్నారు.

ఇక కథ దొరక్క నాలుగు నెలలు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. మధ్యలో నాకు జరిగిన భారీ యాక్సిడెంట్‌. ఇవన్నీ తట్టుకుని 'అదుర్స్‌'ను విడుదల చేశాం. ఈ సినిమా విజయం ఈ స్థాయిలో ఉంటుందని నేనే ఊహించలేకపోయాను. నా కెరీర్‌లో 'సింహాద్రి'ని మించిన విజయం ఇది అంటూ తన విజయోత్సాహాన్ని మీడియాతో పంచుకున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu