»   » శ్రీదేవి గురించి భయపడుతూ చెప్పిన రాఘవేంద్ర రావు, ఎన్టీఆర్ షాక్ ఇచ్చారు, శోభన్ బాబు జోస్యం!

శ్రీదేవి గురించి భయపడుతూ చెప్పిన రాఘవేంద్ర రావు, ఎన్టీఆర్ షాక్ ఇచ్చారు, శోభన్ బాబు జోస్యం!

Subscribe to Filmibeat Telugu

శ్రీదేవి చాలా మంది హీరోలకు అప్పట్లో లక్కీ హీరోయిన్. ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు చాలా మంది నటులకు శ్రీదేవి కలసి వచ్చింది. శ్రీదేవి కాంబినేషన్లో స్టార్ హీరోలంతా అద్భుత విజయాల్ని సొంతం చేసుకున్నారు. శ్రీదేవి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఆమె బాలనటిగా అంటించిన హీరోలతోనే , హీరోయిన్ గా మారి ఆడిపాడింది. ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి హీరోలకు మొదట బాలనటిగా నటించిన తరువాతే శ్రీదేవి హీరోయిన్ గా మారింది. శ్రీదేవి అకాల మృతి తరువాత ఆమె జ్ఞాపకాలని ప్రముఖులు నెమరు వేసుకుంటున్నారు.

 భయపడుతూ చెప్పిన రాఘవేంద్ర రావు

భయపడుతూ చెప్పిన రాఘవేంద్ర రావు

వేటగాడు చిత్రానికి ముందు రాఘవేంద్ర రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అప్పుడే కుర్ర హీరోయిన్ గా రాణిస్తున్న శ్రీదేవిని ఎన్టీఆర్ సరసన నటింపజేయాలనేది రాఘవేంద్ర రావు నిర్ణయం. ఆ విషయాన్ని దర్శకేంద్రుడు ఎన్టీఆర్ కు భయపడుతూనే చెప్పారు.

షాకిచ్చిన ఎన్టీఆర్

షాకిచ్చిన ఎన్టీఆర్

శ్రీదేవిని హీరోయిన్ గా అనుకుంటున్నాం. ఆమె వయసు 16 ఏళ్ళు అని ఎన్టీఆర్ తో రాఘవేంద్ర రావు అన్నారట. నావయసు పదిహేనే కదయ్యా అని ఎన్టీఆర్ బదులివ్వడంతో అంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎన్టీఆర్ సమాధానం రాఘవేంద్ర రావు లో ధైర్యాన్ని నింపింది.

వేటగాడు రికార్డుల వేట

వేటగాడు రికార్డుల వేట

వేటగాడు, ఎన్టీఆర్ జంట వెండి తెరపై అదిరిపోయింది. ఆ చిత్రం రికార్డులు తిరగరాసింది.

 సోగ్గాడు శోభన్ బాబుకు కూడా

సోగ్గాడు శోభన్ బాబుకు కూడా

శోభన్ బాబుకు కూడా శ్రీదేవి మొదట బాలనటిగానే నటించింది. శోభన్ బాబు చిత్రం నా తమ్ముడు లో శ్రీదేవి బాలనటి. ఆ చిత్రంలో శోభన్ బాబు చెప్పిన మాట అక్షర సత్యం అయింది. నీవు తప్పకుండా హీరోయిన్ అవుతావు అని శోభన్ బాబు శ్రీదేవితో చెప్పారట.

 శోభన్ బాబు కాళ్లకు నమస్కరించి

శోభన్ బాబు కాళ్లకు నమస్కరించి

శోభన్ బాబు నోటి వాక్కు నిజమై కార్తీక దీపం చిత్రంలో అతడికే హీరోయిన్ గా తొలిసారి నటించింది. ఆ చిత్ర షూటింగ్ మొదటి రోజు శ్రీదేవి శోభన్ బాబు కాళ్లకు నమస్కరించి ఆయన మాటలని గుర్తుచేసుకుందట.

మొత్తం ఎనిమిది చిత్రాల్లో

మొత్తం ఎనిమిది చిత్రాల్లో

శ్రీదేవి, శోభన్ బాబు జంట కలసి ఆ తరువాత 8 చిత్రాల్లో నటించారు. దేవత చిత్రంలో వెల్లువొచ్చి గోదారమ్మా అనే సాంగ్ ఇప్పటికీ సంగీత ప్రియులని అలరిస్తూనే ఉంటుంది.

English summary
NTR humorous incident with Raghavendra rao while selecting Sridevi as heroine. Raghavendra rao directs NTR in Vetagadu movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu