»   » షాక్ జనతా గ్యారేజ్ రిలీజ్ వాయిదా.... చైతూ హ్యాపీనా..?

షాక్ జనతా గ్యారేజ్ రిలీజ్ వాయిదా.... చైతూ హ్యాపీనా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

టెంపర్, నాన్నకు ప్రేమతో లాంటి వరుస హిట్స్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కతున్న మాస్ ఎంటర్ టైనర్ జనతా గ్యారేజ్. శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్ లను తిరగరాసిన కొరటాల శివ దర్వకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేస్తోంది.

అయితే జనతా గ్యారేజ్ మూవీపై ఇప్పుడో సెన్సేషనల్ అప్ డేట్ వచ్చింది. అదేంటో తెలుసా సినిమా విడుద‌ల తేదీ వాయిదా ప‌డింది. ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ప్రారంభంలోనే రిలీజ్ డేట్ ప్రకటించి.. అందుకు తగ్గట్టుగా షూటింగ్ పూర్త‌వుతోందంటూ జనతా గ్యారేజ్ యూనిట్ అప్ డేట్స్ ఇచ్చింది. ఆగస్ట్ 12 న ఖచ్చితంగా విడుదల ఉంటుందని చెప్పడంతో.. అందుకు అనుగుణంగా మిగిలిన సినిమాల ప్లానింగ్స్ జరిగాయి.


Photos : Janatha Garage Movie Release Date Announcement Press Meet


NTR Janatha Garage postponed, Janatha Garage postponed to September 2nd

ఇప్పుడు హఠాత్తుగా జనతా గ్యారేజ్ ను సెప్టెంబర్ 2కి పోస్ట్ పోస్ చేస్తున్నట్లుగా యూనిట్ నుంచి సమాచారం అందింది. ఇదేదో గాసిప్ టైపు వార్త కూడా కాదు.. మేకర్స్ నుంచి అందిన అఫీషియల్ న్యూస్. తప్పనిసరి పరిస్థితులు.. సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు చెబుతున్నారు. అయితే వాయిదా పడ్డం తమకేమీ బాధ లేదని.. తాము అనుకున్న దానికంటే ఔట్ పుట్ గొప్పగా వచ్చిందని అంటున్నారు.


మనకు తెలిసినట్లుగా జనతా గ్యారేజ్ ద్విభాషా చిత్రం ఒకేసారి తెలుగు మరియు మలయాళం తెరకెక్కుతోంది. కొంత మంది మలయాళం యాక్టర్స్ మోహన్ లాల్, నిత్యా మీనన్ మరియు ఉన్ని ముకుందన్ లాంటి వాళ్ళు ముఖ్య పాత్రల్లో కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో చేస్తున్నారు.ఈ ఏడాది చాలా సినిమాలు రిలీజ్ డేట్ విషయంలో మాట తప్పినా.. కొరటాల క్లారిటీపై చాలామంది నమ్మకం ఉంచారు. పాటలు తప్ప వేరే ఏమీ పెండింగ్ లేదని కూడా చెప్పిన యూనిట్.. ఇప్పుడు హఠాత్తుగా రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో.. అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు.


NTR Janatha Garage postponed, Janatha Garage postponed to September 2nd

జనతా గ్యారేజ్ వస్తుందనే నాగచైతన్య తన ప్రేమం రిలీజ్ డేట్ ని వాయిదా వేసుకున్నాడు. అయితే ఇప్పుడు యంగ్టైగర్ కాస్త వెనక బడతం, కబాలి తెలుగు రిలీజ్ కూడా లేట్ ఔతుందన్న వార్తలు వస్తున్న నేపథ్యం లో చైతూ కాస్త ముందే వచ్చే ఆలోచన చేస్తాడా?

English summary
Janata garage makers had planned to release the film on the 12th of August. However, an official update from the makers revealed that the film’s release has been postponed to September 2nd as there is still a week’s shooting left.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu