twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఎన్టీఆర్ కథానాయకుడు' ట్విట్టర్ రివ్యూ: సెకండ్ హాఫ్ కేక .. బాలయ్య ఆ సీన్స్‌లో అదుర్స్!

    |

    Recommended Video

    NTR Kathanayakudu Twitter Review ఎన్టీఆర్ కథానాయకుడు ట్విట్టర్ రివ్యూ | Filmibeat Telugu

    నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం నేడు విడుదలవుతోంది. ఎన్టీఆర్ జీవితాన్ని రెండు భాగాలుగా విభజిస్తూ దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహా నాయకుడు చిత్రాలని రూపొందించారు. మొదటి భాగమైన ఎన్టీఆర్ కథానాయకుడులో ఆయన సినీరంగ విశేషాలు చూపించబోతున్నారు. ఎన్టీఆర్ వెండి తెరపై చేసిన పాత్రలు అభిమానులకు తెలుసు. కానీ తెర వెనుక స్టార్ గా ఎదగడానికి పడ్డ కష్టం మాత్రం తెలియదు. ఆ విశేషాలన్నీ ఈ చిత్రంలో చూపించబోతుండడంతో ఉత్కంఠ నెలకొంది. సంక్రాంతికి రాబోతున్న తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత ఎక్కువగా నెలకొని ఉంది. ఇప్పటికే తెలుగురాష్ట్రాల్లో ప్రీమియర్స్ ప్రారంభమయ్యాయి. ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం!

    హైలైట్స్ ఇవే

    ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో బాలయ్య అద్భుత నటన ప్రదర్శించారు. కీరవాణి అందించిన బ్యాగ్రౌండ్ సంగీత ఈ చిత్రానికి పెద్ద ప్లస్.

    మాస్టర్ పీస్

    ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం మాస్టర్ పీస్ అనిపించేలా ఉంది.

    సెకండ్ హాఫ్

    ఫస్ట్ హాఫ్ కంటే సెంకండ్ హాఫ్ బావుంది. అభిమానులు మెచ్చే అంశాలు ఎక్కువగా ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద విజయం ఖాయం.

    ఆ సన్నివేశాలు అదుర్స్

    ఎన్టీఆర్ తోటరాముడుగా నటించే సీన్స్, సావిత్రితో నటించే సన్నివేవాలు చాలా బావున్నాయి. దర్శకుడు క్రిష్ తన ప్రతిభ చూపించారు.

    ఘనవిజయం ఖాయం

    సెకండ్ హాఫ్ లో ఎలివేషన్ సన్నివేశాలు అద్భుతంగాఉన్నాయి. ఎన్టీఆర్ కథానాయకుడు ఘనవిజయం ఖాయం.

    చివరి 20 నిమిషాలు

    చివరి 20 నిమిషాలలో వచ్చే సన్నివేశాలు సినిమాని నిలబెట్టాయి. ఎన్టీఆర్ మహానాయకుడు కోసం వెయిటింగ్.

    సినీరంగంలో

    ఎన్టీఆర్ కథ నాయకుడు మొత్తం ఆయన సినీరంగంలో తిరుగులేని స్టార్ గా ఎలా అవతరించాడు అనే అంశం గురించే. ఎన్టీఆర్ ఆసక్తికరమైన ప్రకటనతో ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం ముగుస్తుంది.

    ఆ సీన్స్ నిరాశపరిచేలా

    ఎన్టీఆర్ వివిధ పాత్రల్లో నటించే సన్నివేశాలు నిరాశపరిచేలా ఉన్నాయి. ఆయన రియల్ లైఫ్ సీన్స్ బావున్నాయి. సెకండ్ హాఫ్ సినిమాకు పెద్ద బలం.

    కేవలం ఒకసారి మాత్రమే

    ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం ఒకసారి చూసే విధంగా ఉంది. కొన్ని సన్నివేశాలు కేవలం అభిమానులు మాత్రమే మెచ్చే విధంగా ఉన్నాయి.

    డైలాగులు అదుర్స్

    ఈ చిత్రానికి సాయిమాధవ్ బుర్ర అందించిన డైలాగులు చాలా బావున్నాయి. సినిమా కాస్త స్లోగా సాగినట్లు అనిపిస్తుంది.

    English summary
    NTR Kathanayakudu movie twitter review and audience response. NTR Kathanayakudu releasing world wide today
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X