twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ రిలీజ్ రివ్యూ: పోటీపడి పట్టేశారు.. రాత వారి చేతుల్లోనే.. ఎన్టీవోడిది కనకవర్షమే

    |

    తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా సంబంధించి మొదటి భాగానికి ఎన్టీఆర్ కథానాయకుడు అనే టైటిల్‌ను ఖారారు చేయగా, రెండో భాగానికి ఎన్టీఆర్ మహానాయకుడు అనే పేరు పెట్టారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం రిలీజ్‌కు ముందే సంచలనాలు సృష్టిస్తున్నది. ఈ చిత్రం జనవరి 9న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆసక్తికరమైన అంశాలు ఇవే..

    సెన్సేషనల్‌గా ప్రీ రిలీజ్ బిజినెస్

    సెన్సేషనల్‌గా ప్రీ రిలీజ్ బిజినెస్

    ఎన్టీఆర్ కథానాయకుడు అనే సినిమా విడుదలకు ముందే రూ.100 కోట్లకుపైగా బిజినెస్ చేయడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఈ సినిమా డిజిటిల్ హక్కులను రూ.25 కోట్లకు అమ్ముడుపోయాయి. డిజిటల్ రైట్స్ విషయంలో ఇది ఓ రికార్డుగా చెప్పుకొంటున్నారు. అలాగే బాలకృష్ణ కెరీర్‌లోనే ఇది అత్యుత్తమంగా చెప్పుకొంటున్నారు. ఈ హక్కులను దక్కించుకోవడానికి పలు సంస్థలు పోటిపడ్డాయి.

     ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల

    ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల

    ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రం 600 స్క్రీన్లలో ప్రదర్శించనున్నారు. అలాగే బెంగళూరు, ఇతర పాంత్రాల్లో 225 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 275 స్క్రీన్లలో ఎన్టీఆర్ కథానాయకుడు ప్రదర్శించడానికి ఏర్పాట్లు జరిగాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 1110 స్క్రీన్ల మేర ప్రదర్శించనున్నారు.

    రికార్డు ధరకు హక్కులు

    రికార్డు ధరకు హక్కులు

    ఎన్టీఆర్ బయోపిక్ కోసం బాలకృష్ణ, క్రిష్ జాగర్లముడి రెండోసారి జతకట్టారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఫస్ట్ పార్ట్ థియేట్రికల్ హక్కుల విషయం ఓ రికార్డుగా మిగిలింది. క్రిష్, బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి ప్రపంచవ్యాప్త హక్కులు రూ.46.80 కోట్లకు అమ్ముడుపోగా, ఎన్టీఆర్ బయోపిక్ మాత్రం రూ.70 కోట్ల థియేట్రికల్ హక్కులు (తెలుగు రాష్ట్రాల్లో), 25 కోట్లు డిజిటల్ రూపంలో వచ్చాయి. ఓవర్సీస్ హక్కులు కూడా భారీ రేటుకు అమ్ముడుపోయాయి.

    తొలిరోజుపై భారీగా అంచనాలు

    తొలిరోజుపై భారీగా అంచనాలు

    ఎన్టీఆర్ బయోపిక్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగానే కౌంటర్లన్నీ హౌస్‌ఫుల్‌ బోర్డులతో నిండిపోయాయి. ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లపై భారీ అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.20 కోట్లకుపైగానే వసూళ్లు రాబట్టే అవకాశం ఉందనే మాట వినిపిస్తున్నది.

    క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్‌లో

    క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్‌లో

    ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని ఎన్‌బీకే ఫిల్మ్స్, వరాహి చలన చిత్రం, విబ్రి మీడియా బ్యానర్స్‌పై బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇంటూరి నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సతీమణిగా విద్యాబాలన్ నటిస్తున్నారు. ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ఈ చిత్రానికి కు కంచె, గౌతమి పుత్రశాతకర్ణి సినిమాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం, ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహించారు.

    పోటీపడి నటించిన సినీతారలు

    పోటీపడి నటించిన సినీతారలు

    ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించేందుకు టాలీవుడ్ తారలు ఉత్సాహం చూపడమే కాకుండా పోటి పడ్డారు. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్, రానా దగ్గుబాటి, సుమంత్, రకుల్ ప్రీత్ సింగ్, నిత్యా మీనన్, ప్రణిత, శ్రియాసరన్, హన్సిక మోత్వాని, షాలిని పాండే, మంజిమా మోహన్ తదితరులు నటించారు.

    తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో

    తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో

    తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్టీఆర్ కథానాయకుడు ప్రదర్శించే థియేటర్ల వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాదాపు 100 థియేటర్లలో వీటిని ఏర్పాటు చేస్తారు. తొలి విగ్రహాన్ని తిరుపతిలోని పీజేఆర్ థియేటర్లలో ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, విద్యాబాలన్ పాల్గొంటారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

    English summary
    NTR: Kathanayakudu will be released 1,100 plus screens across the globe. Reports suggest that will surely get a record-breaking opening and collected Rs 25 to 30 crore gross at the worldwide box office on the first day of its release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X