»   »  ఈ ఆదివారమే ఎన్టీఆర్ కొత్త చిత్రం లాంచింగ్

ఈ ఆదివారమే ఎన్టీఆర్ కొత్త చిత్రం లాంచింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాన్నకు ప్రేమతో చిత్రం కోసం వెళ్ళాల్సిన ఎన్టీఆర్ ఫారిన్ ట్రిప్ కొద్దిగా లేటవటంతో నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ ఆదివారం కొత్త చిత్రం ఓపినింగ్ పెట్టేసుకున్నారు. మహేష్ శ్రీమంతుడు చిత్రంతో ఫిల్మ్ ప్రొడక్షన్ లోకు ప్రవేశించిన మైత్రీ మూవీ మేకర్స్ వారు...కొరటాల శివ తోనే తమ తదుపరి చిత్రం సైతం ప్లాన్ చేసారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టుకి సైన్ చేసారు. దాంతో ఈ ఆదివారం అంటే అక్టోబర్ 25న ఈ సంస్ద ఆఫీస్ లో... ఈ చిత్రం ఫార్మల్ పూజతో లాంచ్ అవనుంది. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈలోగా ఎన్టీఆర్ స్పెయిన్ వెళ్లి వచ్చి ఈ ప్రాజెక్టు కు సంభందించిన విషయాలు పరిశీలిస్తారని సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నిజానికి రామయ్యావస్తావయ్యా చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించాల్సి ఉందట. అయితే ఈలోపు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ టెంపర్ సినిమా అంగీకరించడం.. మహేశ్ హీరోగా శ్రీమంతుడు చిత్రానికి కొరటాల శివ కమిట్ అవడంతో.. ఈ కాంబినేషన్ వాయిదా పడింది. తాజాగా ఎన్టీఆర్ కోసం కొరటాల అద్బుతమైన స్టోరీ సిద్ధం చేసి ఓకే చేయించుకున్నాడని, ప్రస్తుతం దానికి నగిషీలు దిద్దుతున్నాడని టాలీవుడ్ టాక్.

NTR, Koratala film to be launched this Sunday

అయితే సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ సినిమా సినిమా పూర్తయ్యాకే ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా 2016లో సెట్స్ పైకి వెళ్లు తుందని తెలుస్తోంది. మాటల రచయితగా గుర్తింపు పొందిన కొరటాల శివ ఎన్టీఆర్ నటించిన ‘బృందావనం, ఉసరవెల్లి' చిత్రాలకు మాటలు అందించారు.

ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో'. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాత. ఈ నెల 21 సాయంత్రం 6 గంటలకు టీజర్‌ని విడుదల చేయబోతున్నారు.

నిర్మాత మాట్లాడుతూ ''తండ్రీ కొడకుల అనుబంధం నేపథ్యంలో సాగే చిత్రమిది. తారక్‌ తెరపై కనిపించే విధానం కొత్తగా ఉంటుంది. సుకుమార్‌ విభిన్నమైన కథ, కథనాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే నెల 1 నుంచి స్పెయిన్‌లో చిత్రీకరణ జరుపుతున్నాం. పండగకి ఒక రోజు ముందు విడుదలవుతున్న టీజర్‌ పండగని మరింత సందడిగా మార్చబోతోంది. సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేస్తాం'' అన్నారు.

జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఛాయాగ్రహణం: విజయ చక్రవర్తి, కళ: రవీందర్‌, పోరాటాలు: పీటర్‌ హెయిన్స్‌, కూర్పు: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌

English summary
Mythri Movie Makers that ventured into film production with Mahesh Babu’s Srimanthudu is producing their second film with Srimanthudu director Koratala Siva as well. NTR has already signed the movie. On Sunday, October 25th, the movie would be formally launched at their office.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu