»   »  స్పాన్ ఉన్న, హైలీ ఎమోషన్ కథతోనే :కొరటాల శివ

స్పాన్ ఉన్న, హైలీ ఎమోషన్ కథతోనే :కొరటాల శివ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్ హీరో గా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో 'జనతా గారేజ్' అనే ఒక భారీ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించబోతోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవం గత ఏడాది అక్టోబర్ 25 న హైదరాబాద్ లో మైత్రీ మూవీస్ కార్యాలయం లో, చిత్ర యూనిట్ నడుమ జరిగింది.

తొలి చిత్రం నుంచి ఇప్పటిదాకా : ఎన్టీఆర్ లో మార్పులు ఇలా (ఫొటో ఫీచర్)

'నాన్నకు ప్రేమతో' చిత్రం తో భారి బ్లాక్బస్టర్ ను అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు సరికొత్త లుక్ తో ఈ చిత్రం లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 22 న ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో లాంచనం గా ప్రారంభం అవుతుంది. ఆ తరువాత ఈ చిత్రం కోసం ప్రత్యేకం గా నిర్మించిన భారీ సెట్ లో షూటింగ్ కొనసాగుతుంది.

పవన్,మహేష్,ఎన్టీఆర్ ల గురించి సమంత (ఫొటో ఫీచర్)

దర్శకులు కొరటాల శివ మాట్లాడుతూ : "యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో ఉన్న నటుడికి, అయన మాస్ ఇమేజ్ కి సరిపడే కథ ఇది. చాలా పెద్ద స్పాన్ ఉన్న ఒక హైలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఈ చిత్రం. ఎన్నో సంవత్సరాల గా ఎన్టీఆర్ ను ఎలా చూడాలి అనుకుంటున్నానో, అలా ఆయన క్యారెక్టర్ ను తీర్చిదిద్దాను. ఫిబ్రవరి 22న షూటింగ్ ను ప్రారంభించి, ఆగష్టు 12న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం", అని తెలిపారు

 NTR - Koratala Siva - Janatha Garage Shoot from Feb 22nd

నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ లు మాట్లాడుతూ : "మా బ్యానర్ లో రెండవ చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారితో చేయటం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. మా బ్యానర్ లో మొదటి చిత్రం అయిన 'శ్రీమంతుడు' ని బ్లాక్బస్టర్ గా తీర్చిదిద్దిన మా డైరెక్టర్ కొరటాల శివ గారితో మళ్లీ పనిచేయటం చాలా సంతోషం గా ఉంది.

ఎన్టీఆర్ కోసం పాత కార్లు సేకరణ...పెద్ద షెడ్ (షెడ్ ఫొటోలు)

 ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చే ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకం గా నిర్మిస్తాం. ఆగస్టు 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. హైదరాబాద్ , చెన్నై, ముంబై మరియు కేరళ లో షూటింగ్ జరుగుతుంది. భారీ తారాగణం తో, మంచి పవర్ఫుల్ సబ్జెక్టు తో దర్శకులు కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు" అని తెలిపారు.

 NTR - Koratala Siva - Janatha Garage Shoot from Feb 22nd

ఎన్టీఆర్ సరసన సమాంతా, నిత్యా మీనన్ లు హీరోయిన్స్ గా కనిపిస్తారు. ప్రఖ్యాత మళయాళం నటుడు మోహన్ లాల్ ఈ చిత్రం లో ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. సాయి కుమార్, ఉన్ని ముకుందన్, అజయ్, బ్రహ్మాజీ, బెనర్జీ , జాన్, గుణాజీ ,సితార, దేవయాని వంటి ప్రఖ్యాత నటులు ఈ చిత్రం లో ముఖ్య పత్రాలను పోషిస్తున్నారు.

English summary
NTR and acclaimed director Koratala Siva have teamed up for a new project titled 'Janatha Garage' and this film is being produced by the prestigious Mythri Movies banner. The film was formally launched on October 25th last year. Regular shooting will commence from February 22nd in Ramoji Film City.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X