»   » ఎన్టీఆర్ కొడుకుతో కొరటాల శివ మూవీ ప్రారంభోత్సవం (ఫోటోస్)

ఎన్టీఆర్ కొడుకుతో కొరటాల శివ మూవీ ప్రారంభోత్సవం (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో ఒక భారీ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించబోతోంది. ఈ చిత్రం పూజా కార్యక్రమం నేడు (October 25) హైదరాబాద్ లో మైత్రీ మూవీస్ కార్యాలయం లో చిత్ర బృందం నడుమ జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా నందమూరి కళ్యాణ్ రామ్ , బి వి ఎస్ ఎన్ ప్రసాద్, పొట్లూరి వి ప్రసాద్ (PVP), శ్యాంప్రసాద్ రెడ్డి, శిరీష్ రెడ్డి ,దానయ్య డి వి వి, ఆచంట రామ్, ఆచంట గోపి , వి. వి వినాయక్, ఎర్రబెల్లి దయాకర రావు, నాగం జనార్ధన్ రెడ్డి, రేవంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఈ చిత్రానికి క్లాప్ ను ఎన్టీఆర్ కొట్టగా, ఆయన తనయుడు అభయ్ రామ్ తో కెమెరా స్విచ్ ఆన్ చేయించారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ :
కొరటాల శివ తో నాకు బృందావనం రోజుల నుండి అనుబంధం ఉంది. అయన ఒక అధ్బుతమైన రచయిత. ఒక అభిరుచి గల డైరెక్టర్. క్లాస్, మాస్ అంశాలను ఆయన బాలన్స్ చేసుకునే విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. కొరటాల శివ అందించిన ఈ కథ నాకు బాగా నచ్చింది. మైత్రీ మూవీస్ సంస్థ తో పని చేయటం ఆనందం గా ఉంది.

స్లడ్ షోలో ఫోటోస్, వివరాలు...

దర్శకులు కొరటాల శివ మాట్లాడుతూ

దర్శకులు కొరటాల శివ మాట్లాడుతూ


యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో ఉన్న నటుడికి, అయన మాస్ ఇమేజ్ కి సరిపడే కథ ఇది. చాలా పెద్ద స్పాన్ ఉన్న ఒక హైలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఈ చిత్రం. ఎన్నో సంవత్సరాల గా ఎన్టీఆర్ ను ఎలా చూడాలి అనుకుంటున్నానో, అలా అయన క్యారెక్టర్ ను తీర్చిదిద్దాను అన్నారు.

షూటింగ్

షూటింగ్


జనవరి లో షూటింగ్ ను ప్రారంభించి, ఆగస్టు 12న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రం లో ఇద్దరు హీరోయిన్ లు, ఒక ముఖ్య పాత్ర లో చాలా ప్రముఖ నటుడు ఉంటారు. ఈ వివరాలను త్వరలో తెలియజేస్తామని దర్శకుడు తెలిపారు.

నిర్మాతలు మాట్లాడుతూ

నిర్మాతలు మాట్లాడుతూ


మంచి చిత్రాలను ఉత్తమ సాంకేతిక విలువలతో ప్రేక్షకులకు అందించాలనే ఆశయం తో మైత్రీ మూవీస్ సంస్థ ను ప్రారంభించాం. మా రెండవ చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారితో తో చేయటం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు.

నో కాంప్రమైజ్

నో కాంప్రమైజ్


మా బ్యానర్ లో మొదటి చిత్రం అయిన 'శ్రీమంతుడు' ని బ్లాక్బస్టర్ గా తీర్చిదిద్దిన మా డైరెక్టర్ కొరటాల శివ గారితో మళ్లీ పనిచేయటం చాలా సంతోషం గా ఉంది. ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చే ఈ చిత్రాన్ని భారీ వ్యయం తో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తామన్నారు.

రిలీజ్ డేట్

రిలీజ్ డేట్


జనవరి 2016 నుండి షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఆగస్టు 12న, కృష్ణా పుష్కరాల సందర్భం గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం.

తెర వెనక

తెర వెనక


ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి - మది . ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వర రావు . ఆర్ట్ - ఎ. ఎస్. ప్రకాష్ నిర్మాతలు - నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ (C. V. M.) కథ - మాటలు - దర్శకత్వం - కొరటాల శివ.

త్వరలో..

త్వరలో..


ఈ చిత్రానికి హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు. హీరోయిన్ ఫైనల్ అయిన తర్వాత అఫీషియల్ ప్రకటన చేయనున్నారు.

English summary
Young Tiger NTR and acclaimed director Koratala Siva are teaming up for a new project that will be produced by the prestigious Mythri Movies banner. The film was formally launched today with a pooja ceremony at the Mythri Movies office in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu