»   » ఎన్టీఆర్ చేతుల మీదుగా సాయి ధరమ్ తేజ కొత్త చిత్రం 'జవాన్' లాంచ్

ఎన్టీఆర్ చేతుల మీదుగా సాయి ధరమ్ తేజ కొత్త చిత్రం 'జవాన్' లాంచ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కుర్ర హీరోల్లలో వరస హిట్స్ కొట్టి మినిమమ్ గ్యారెంటీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నది ఎవరూ అంటే ...వెంటనే గుర్తుకు వచ్చే హీరో సాయి ధరమ్ తేజ్. మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా ఆ ప్రభావం తన మీద పడకుండా, మీడియం రేంజ్ సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు.

వరుసగా పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాలతో మంచి సక్సెస్ లు సాధించాడు సాయి. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో విన్నర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తను చేయబోయే నెక్ట్స్ సినిమాను కూడా లైన్ లో పెట్టాడు.

ప్రముఖ రచయిత బివియస్ రవి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు సాయి. ఈ సినిమాకు జవాన్ అనే టైటిల్ ఫిక్స్ చేసి పట్టాలు ఎక్కించారు. దర్శకుడు హరీష్ శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ రోజు సెట్స్ మీదకు వెళ్లింది.

ఎన్టీఆర్ వచ్చి మరీ..

ఎన్టీఆర్ వచ్చి మరీ..

డైరక్టర్ హరీష్ శంకర్ నిర్మాతగా, రైటర్ బివిఎస్ రవి డైరక్టర్ గా రూపొందే సినిమాకు ఈ రోజు ఉదయం మహుర్తం జరిగింది. సినిమా ముహర్తానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా వచ్చి హరీష్, బివిఎస్ రవి, సాయి ధరమ్ లను అభినందించారు.

హీరోయిన్ గా మేహ్రీన్..

హీరోయిన్ గా మేహ్రీన్..

ఈ సినిమా టైటిల్ జవాన్ అని ఫిక్స్ చేయాలని హరీష్-బివిఎస్ రవి డిసైడ్ అయ్యారు. నూతన నిర్మాత కృష్ణ నిర్మించనున్నారు. ‘జవాన్' సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ' ఫేం మేహ్రీన్ కౌర్ నటిస్తున్నది. ఈ సినిమా గురించి మిగతా వివరాలు త్వరలో తెలుస్తాయి.

ప్రతీ ఇంటికి

ప్రతీ ఇంటికి

అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికో టాగ్ లైన్ కూడా వుంది. ఇంటికొక్కడు అన్నది ఆ టాగ్ లైన్. ప్రతి ఇంటికి , తన వాళ్ల రక్షణకు జవాన్ లాంటి వాడు ఒకడు వుంటాడు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రెడీ అయ్యి పట్టాలు ఎక్కుతోంది.

గతంలో రెడీ చేసిన కథే..

గతంలో రెడీ చేసిన కథే..

ఈ కథను బివిఎస్ రవి ఎప్పుడో రెడీ చేసి వుంచారు. పూర్తిగా మెరుగులు దిద్దుతూ వచ్చి, ఇప్పటికి ఫ్లాట్ ఫారమ్ మీదకు తెచ్చారు. గతంలో బివియస్ రవి..వాంటెడ్ అనే చిత్రం డైరక్ట్ చేసారు. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. దాంతో ఈ చిత్రంపై నమ్మకంగా ఉన్నారు.

ఎన్టీఆర్ క్లాప్ కొట్టడం...

ఎన్టీఆర్ క్లాప్ కొట్టడం...

'మా జవాన్ మూవీకి తొలి క్లాప్ ను ఎన్టీఆర్ కొట్టడంతో.. ఎగ్జైటింగ్ ప్రారంభం లభించింది. సాయిధరంతేజ్ హీరోగా బీవీఎస్ రవి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నా.. మమ్మల్ని ఆశీర్వదించండి' అంటూ టీమ్ అంతా ఎన్టీఆర్ అండ్ తేజ్ ఫోటోలను షేర్ చేస్తూ ఎక్సయిట్ అవుతున్నారు.

English summary
Young Tiger NTR launched the movie with a clap which has been titled Jawan – Intiki Okkadu. writer turned director BVS Ravi will direct the movie and the regular shoot will start from February this year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu