twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ మహానాయకుడు: రంగంలోకి బాలయ్య.. నష్టపోయిన వారికి ఒక్కరూపాయి తీసుకోకుండానే డీల్!

    |

    ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ మొదటి భాగం 'ఎన్టీఆర్-కథానాయకుడు' సంక్రాంతికి విడుదలై మంచి టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీసు వద్ద కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు. సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయారు.

    మరో వారం రోజుల్లో సెకండ్ పార్ట్ 'ఎన్టీఆర్-మహానాయకుడు' రిలీజ్ ఉన్న నేపథ్యంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య బిజినెస్ డీల్ విషయంలో కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. నష్టపోయిన వారికి 25% పరిహారం చెల్లించి... రెండో భాగానికి అంగీకారయోగ్యం కాని రేటు చెప్పడంతో డిస్ట్రిబ్యూటర్లు నిరసన వ్యక్తం చేయగా... బాలయ్య రంగంలోకి దిగి అందరికీ ఆమోద యోగ్యంగా ఉండేలా డీల్ పినిష్ చేసినట్లు సమాచారం.

    ఒక్క రూపాయి చెల్లించకుండానే రైట్స్ ఇవ్వాలని నిర్ణయం

    ఒక్క రూపాయి చెల్లించకుండానే రైట్స్ ఇవ్వాలని నిర్ణయం

    మొదటి భాగం థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ. 70 కోట్లకు అమ్ముడవ్వగా... కేవలం 20 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. డిస్ట్రిబ్యూటర్లు దాదాపు 50 కోట్లు నష్టపోయారు. ఈ నేపథ్యంలో రెండో భాగం ‘ఎన్టీఆర్-మహానాయకుడు' చిత్రాన్ని అదే డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందు కోసం వారు ముందుగా ఒక్క రూపాయి చెల్లించకుండానే రైట్స్ ఇవ్వబోతున్నారట.

    33 శాతం పరిహారం...

    33 శాతం పరిహారం...

    మొదటి భాగం వల్ల బయ్యర్లు ఎంత నష్టపోయారో అందులో 33శాతం పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ‘ఎన్టీఆర్-మహానాయకుడు' చిత్రానికి వచ్చే షేర్లో మొదట 33 శాతం నష్టాలను బయ్యర్లు రికవరీ చేసుకోబోతున్నారు.

    ఆపై వచ్చే షేర్ పంచుకోనున్న నిర్మాత, డిస్ట్రిబ్యూటర్

    ఆపై వచ్చే షేర్ పంచుకోనున్న నిర్మాత, డిస్ట్రిబ్యూటర్

    మొదట 33 శాతం నష్టం రికవరీ చేసుకున్న తర్వాత... ఆపై వచ్చే రెవెన్యూలో 60 శాతం నిర్మాత తీసుకుని, 40 శాతం డిస్ట్రిబ్యూటర్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ డీల్ మీద డిస్ట్రిబ్యూటర్లు సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

    ఒక వేళ నష్టాలు రికవరీ కాకపోతే...

    ఒక వేళ నష్టాలు రికవరీ కాకపోతే...

    ‘ఎన్టీఆర్-మహానాయకుడు' విడుదల తర్వాత కూడా మొదటి భాగం వల్ల ఏర్పడిన లాస్ రికవరీ కాకపోతే.... బాలయ్య తర్వాతి సినిమా థియేట్రికల్ రైట్స్ రీజనబుల్ రేటకు ఇస్తామని ప్రామిస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ డీల్ ఇరు వర్గాలకు ఓకే కావడంతో ఈ మేరకు అగ్రిమెంట్లు చేసుకున్నట్లు సమాచారం

    ఎన్టీఆర్-మహానాయకుడు

    ఎన్టీఆర్-మహానాయకుడు

    ఎన్టీఆర్-మహానాయకుడు చిత్రాన్ని ఫిబ్రవరి 22న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం మొత్తం ఎన్టీ రామారావు రాజకీయ జీవితం గురించి ఉండబోతోంది. తెలుగు దేశం పార్టీ పెట్టింది మొదలు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టే వరకు జరిగిన కథను ఇందులో చూపించనున్నారు.

    English summary
    NTR -Mahanayakudu: This is the agreement between producers and distributors. The buyers across India can now recover 33% of the losses of the first installment and then the overflow amount will be shared with the makers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X