»   » ఎన్టీఆర్ 'ఊసరవెల్లి' స్టోరీ పాయింట్ అదే...

ఎన్టీఆర్ 'ఊసరవెల్లి' స్టోరీ పాయింట్ అదే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

పరిస్థితులకి తగ్గట్లు రంగులు మార్చుకుంటూ తన లక్ష్యాన్ని సక్రమ మార్గంలో హీరో ఎలా చేరుకున్నాడనేది 'ఊసరవెల్లి' లోని ప్రధానాంశం. ఎవరూ ఊహించని మలుపులతో నడిచే పటిష్టమైన కథ, ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించే స్క్రీన్‌ప్లే ప్రధానాకర్షణలు అంటున్నారు నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్. ఈ చిత్రం విశేషాలను మీడియాకు వివరిస్తూ ఆయన ఇలా స్పందించారు. అలాగే ఈ చిత్ర నిర్మాణంలో ఎన్టీఆర్ ఎంతో సహకారం అందిస్తున్నారు. ఇది ఆయన్ని ఓ కొత్తకోణంలో చూపిస్తున్న పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్. రొమాన్స్, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్, మ్యూజిక్ అన్నీ మేళవించిన బిగ్ మూవీ. హైదరాబాద్, బ్యాంకాక్, ముంబై, ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్‌లలో షూటింగ్ చేశాం. ఈ నెల రెండో వాశరంలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల చేస్తున్నాం. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన బాణీలిచ్చారు. అక్టోబర్ 6న విజయదశమి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్.ఆర్. ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది'' అని చెప్పారు.

'కిక్' వంటి సూపర్ హిట్ తర్వాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, కిక్ శ్యామ్, తనికెళ్ల భరణి, ఆద్విక్ మహాజన్, మురళీశర్మ, ఆహుతి ప్రసాద్, రెహమాన్, జయప్రకాశ్‌రెడ్డి, రఘుబాబు, అజయ్, ఎమ్మెస్ నారాయణ, పాయల్ ఘోష్, దువ్వాసి మోహన్, రఘు కారుమంచి, జీవీ, విద్యుత్ జమ్వాల్, బెనర్జీ తారాగణమైన ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, మాటలు: కొరటాల శివ, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, చంద్రబోస్, సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, యాక్షన్: రామ్-లక్ష్మణ్, కళ: రవీందర్, లైన్ ప్రొడ్యూసర్: చక్రవర్తి రామచంద్ర, సమర్పణ: బి. బాపినీడు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేందర్‌రెడ్డి.

English summary
Jr Ntr starrer Oosaravelli has got its release date. The film-makers have decided to release the film on 6th, October during Dussera time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu