»   » గుణశేఖర్ ప్రాజెక్ట్: వీరాభిమన్య పాత్రలో జూ ఎన్టీఆర్?

గుణశేఖర్ ప్రాజెక్ట్: వీరాభిమన్య పాత్రలో జూ ఎన్టీఆర్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాల రామాయణం' సినిమా ద్వారానే జూ ఎన్టీఆర్ బాలనటుడిగా వెండితెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. తాజాగా గుణశేఖర్ తాను తీయబోయే హిస్టారికల్ చిత్రంలో ఎన్టీఆర్‌ను ఓ ముఖ్యమైన పాత్రకు ఎంపిక చేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. గుణశేఖర్ త్వరలో తెరకెక్కించబోయే ప్రాజెక్టులో మహాభారతంలో ఎంతో కీలకమైన ‘అభిమన్యు' పాత్రను ఎన్టీఆర్‌ను ఎంపిక చేస్తున్నట్లు టాక్.

ఇటీవల గుణశేఖర్ ‘వీరాభిమన్యు' అనే టైటిల్ ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. దీంతో మహాభారతంలో అభిమన్యుడు చేసిన వీరోచిత పోరాటం నేపథ్యంలో గుణశేఖర్ సినిమా తీయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పాత్రకు కేవలం జూ ఎన్టీఆర్ మాత్రమే న్యాయం చేయగలడని గుణశేఖర్ బలంగా నమ్ముతున్నాట్ట. ఈమేరకు ఎన్టీఆర్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాట్ట.

వాస్తవానికి గుణశేఖర్ తెరకెక్కించిన ‘రుద్రమదేవి' చిత్రంలో గోనగన్నారెడ్డి పాత్రను ఎన్టీఆర్ చేయాల్సింది. తొలుత ఈ పాత్ర కోసం గుణశేఖర్ ఎన్టీఆర్ నే సంప్రదించాడు. అయితే పలు కారణాలతో ఎన్టీఆర్ ఆ పాత్ర చేయక పోవడంతో చివరకు అల్లు అర్జున్ తో ఆ పాత్రను చేయించారు.

NTR To Play Abhimanyu In A Historic Film, Guess The Director

రుద్రమదేవి తర్వాత సినిమాగా 'ప్రతాపరుద్రుడు' తీస్తానని ప్రకటించిన గుణశేఖర్ అందుకు తగ్గట్లుగా 'రుద్రమదేవి' ఎండింగ్‌లో టైటిల్ కార్డ్ కూడా వేశాడు. ఇటీవల సక్సెస్ మీట్‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు 'ప్రతాపరుద్రుడు' మూవీ తను నిర్మిస్తానని కూడా ప్రకటించాడు.

అయితే ఇంతలోనే గుణ టీమ్ వర్క్స్ పతాకం పై 'వీరాభిమన్యు' అనే టైటిల్ రిజిస్టర్ చేయడం ఇప్పడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి గుణశేఖర్ ఇప్పడు నిర్మించబోయేది ఏ సినిమా అన్నది తేలాల్సి వుంది. ముందు చెప్పినట్లు ప్రతాపరుద్రుడు తెరకెక్కిస్తాడా లేక వీరాభిమన్యుడుని ముందుకు తెస్తాడా అనే డిష్కషన్స్ మొదలయ్యాయి.

English summary
According to the sources, Gunasekhar recently registered the title Veerabhimanyu at the council and is in plans to make a film on the lines of Abhimanyu's valour in Mahabharatha. Going by the reports, the director wants to cast NTR for the lead role, since only he would do the justice for the kind of diction and command over language, the character demands.
Please Wait while comments are loading...