»   » ‘జనతా గ్యారేజ్‌’ బైక్‌ వేలం పాట, ఎవరికి, ఎంతకి దక్కిందో తెలుసా?

‘జనతా గ్యారేజ్‌’ బైక్‌ వేలం పాట, ఎవరికి, ఎంతకి దక్కిందో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్‌: ఈ మధ్యకాలంలో హీరోలు తమ సినిమాల్లో వాడిన వస్తువులను వేలం వేస్తూ, ఆ వచ్చిన డబ్బుని సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తమ అభిమాన హీరోలు తెరపై వాటిని లక్షలు వెచ్చించి దక్కించుకుని తమ అభిమానాన్ని చాటుకుంటారు ఫ్యాన్స్. ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో 'జనతాగ్యారేజ్‌' చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ఉపయోగించిన గ్రీన్ కలర్ బైక్‌ను వేలానికి పెట్టారు.

  'జనతా గ్యారేజ్‌' చిత్రంలో హీరో ఎన్టీఆర్‌ స్టైలిష్‌గా నడిపిన బైక్‌ పై మొక్కలు ఉన్న పోస్టర్స్ కు అప్పట్లో మంచి క్రేజ్‌ ఏర్పడింది. ఇప్పుడు అదే బైక్‌ను నల్గొండకు చెందిన అభిమాని రాజ్‌కుమార్‌ రెడ్డి సొంతం చేసుకున్నారు. 'జనతా గ్యారేజ్‌' పోటీ ద్వారా రూ. 10 లక్షలు చెల్లించి బైక్‌ను పొందారు. నల్గొండ జిల్లా చేవుల్లగూడెంకు చెందిన ఎన్టీఆర్‌ అభిమాని ఇతను.


  NTR presented Janatha Garage bike to winner Rajkumar Reddy

  ఈ నగదును బసవ తారక రామారావు ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు విరాళంగా ఇస్తున్నట్లు మైత్రి మూవీ మేకర్స్‌ తెలిపింది. ఎన్టీఆర్‌, చిత్ర దర్శకుడు కొరటాల శివ మంగళవారం అతడికి బైక్‌ను అందించారు.


  మోహన్‌లాల్‌, సమంత, నిత్యా మేనన్‌ కీలక పాత్రల్లో నటించిన 'జనతా గ్యారేజ్‌' చిత్రం గత ఏడాది సెప్టెంబరులో విడుదలై విజయం అందుకుంది. మొక్కల్ని ప్రేమించే వ్యక్తిగా ఎన్టీఆర్‌, మనుషుల్ని ప్రేమించే వ్యక్తిగా మోహన్‌లాల్‌ నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రంలో కాజల్‌ స్పెషల్ సాంగ్ లో ఆడిపాడారు.


  ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ రూపొంది విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం 'జనతా గ్యారేజ్‌'. సమంత, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటించగా, మోహన్‌లాల్‌ ఓ కీలక పాత్ర చేసారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్‌, సి.వి. మోహన్ నిర్మించిన ఈ చిత్రానికి 'ఇచట అన్నీ రిపేర్లు చేయబడును' అనేది ట్యాగ్ లైన్. ట్యాగ్ లైన్ కు తగ్గట్లే రికార్డ్ లన్నీ రిపేర్ చేసి , కొత్త రికార్డ్ లు నెలకొల్పింది.


  ఈ చిత్రం విడుదలైనప్పటి నుండి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. కలెక్షన్ల విషయంలో కూడా ఈ చిత్రం ఏమాత్రం తగ్గకుండా ఎన్టీఆర్‌ కెరియర్‌లో మంచి కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సాధించింది.


  NTR presented Janatha Garage bike to winner Rajkumar Reddy

  ఇక ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ...'బాహుబలి' చిత్రం తర్వాత అమ్మకాలలో రెండవ స్థానంలో 10.5కోట్లకు అమ్ముడుపోయింది. 'టెంపర్‌' నుంచి కథల ఎంపిక విధానం మార్చి హిట్‌ కొట్టిన ఎన్టీఆర్‌ ఆ తర్వాత చేసిన 'నాన్నకు ప్రేమతో' సినిమాతో కూడా మరో మంచి హిట్‌ అందుకున్నాడు.


  ఈ రెండు వరుస విజయాలతో విలక్షణమైన కథల వైపు మొగ్గు చూపాలనుకున్నాడో ఏమో కమర్షియల్‌ అంశాలతో పాటు మెసేజ్‌ ఉన్న సినిమాలను చేసే దర్శకుడు కొరటాల శివతో సినిమా చేయడానికి అంగీకరించాడు. ఆ సినిమాయే 'జనతాగ్యారేజ్‌'.

  English summary
  A special contest was run for Janatha Garage with the aim of raising money for charity and the lucky winner was picked through a lottery. The winner is Rajkumar Reddy from Chavulla Gudem, Pagidimarri Post, Nalgonda. A total of 10 lakhs has been raised through the contest and the amount is being donated to Basava Tarakam Charitable Trust.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more