»   » బర్త్ డే స్పెషల్: జూ ఎన్టీఆర్ ‘రభస’ ఫస్ట్‌లుక్ (ఫోటోలు)

బర్త్ డే స్పెషల్: జూ ఎన్టీఆర్ ‘రభస’ ఫస్ట్‌లుక్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్టీఆర్, సమంత, ప్రణీత ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'రభస'. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ సమర్పణలో యువ నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. రేపు (మే 20) జూ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ విడుదల చేసారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ...''ఎన్టీఆర్‌ శైలికి తగ్గ కథ ఇది. హీరో, హీరోయిన్స్ మధ్య వచ్చే సన్నివేశాలు నవ్విస్తూ... వైవిధ్యంగా ఉంటాయి. ఇటీవల పొల్లాచ్చిలో అందమైన లొకేషన్లలో తెరకెక్కించిన పాట సినిమాకి ఆకర్షణగా నిలుస్తుంది. ఎన్టీఆర్‌ నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి'' అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ... '' ఆది తర్వాత మా బేనర్లో ఎన్టీఆర్‌తో చేస్తున్న సినిమా ఇది. ఎన్టీఆర్‌ని కొత్తగా చూపించే చిత్రమిది. యూత్, మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన సినిమాలో ఎలాంటి అంశాలు ఉండాలని ఆశిస్తారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి'' అన్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు స్లైడ్ షోలో....

జూ ఎన్టీఆర్

జూ ఎన్టీఆర్

‘రామయ్యా వస్తావయ్యా' చిత్రం తర్వాత జూ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘రభస'.

ఎన్టీఆర్ నమ్మకం

ఎన్టీఆర్ నమ్మకం

రామయ్యా వస్తావయ్యా చిత్రం ఆశించిన ఫలితాలు ఇవ్వక పోవడంతో ‘రభస' చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు జూ ఎన్టీఆర్.

రియల్ హీరో ఎన్టీఆర్

రియల్ హీరో ఎన్టీఆర్

ఎన్టీఆర్‌ను ఇప్పటి వరకు తెరమీద మాత్రమే హీరోగా చూసాను. కానీ ఆయనతో పని చేసిన తర్వాత ఆయన్ని అన్ని యాంగిల్స్ లో చూసినపుడు నిజజీవితంలోనూ హీరోలా కనిపించారని దర్శకుడు తెలిపాడు.

ఎన్టీఆర్ స్టామినా

ఎన్టీఆర్ స్టామినా

ఎన్టీఆర్ పవర్, ఎన్టీఆర్ స్టామినా ‘రభస'లో చూస్తాం. హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందుతున్న ‘రభస' అన్ని వర్గాల ప్రేక్షకులను అతరిస్తుందని దర్శకుడు తెలిపాడు.

ఫ్యామిలీ, యూత్, మాస్ ఎంటర్టెనర్

ఫ్యామిలీ, యూత్, మాస్ ఎంటర్టెనర్

రభస చిత్రం యూత్, మాస్, ఫ్యామిలీ జోన్స్ ని టార్గెట్ చేసి తీస్తున్న సినిమా. రెండున్నర గంటల సేపు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూసి ఎంజాయ్ చేసి ఐదారు సార్లు చూసేంత ఎంటర్టెనింగుగా ఉంటుందని దర్శకుడు తెలిపారు.

ముఖ్య పాత్ర ధారులు

ముఖ్య పాత్ర ధారులు

ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు

సాంకేతిక నిపుణులు

ఈ చిత్రానికి సంగీతం : తమన్‌ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

English summary
NTR New Movie Rabhasa's First Look has been released on the eve of NTR's Birth Day on 20th May 2014.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu