»   » మహా ఘనుడు అంటూ నమ్మించారు: ఎన్టీఆర్ మ్యాటర్ ఉత్తిదేనా?

మహా ఘనుడు అంటూ నమ్మించారు: ఎన్టీఆర్ మ్యాటర్ ఉత్తిదేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహా నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర సినిమాగా తెరకెక్కిస్తున్నాం అంటూ....గతేడాది ఎన్టీఆర్ జయంతిసందర్భంగా ఓ ప్రకటన వచ్చింది. జె.కె.మూవీస్ పతాకంపై జొన్నలగడ్డ క్రిష్ట సమర్పణలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ‘మహా ఘనుడు' టైటిల్‌తో చిత్రాన్ని నిర్మిస్తున్నామని నిర్మాతలు డి. అనిల్ సుధాకర్, ఎన్.బి. చౌదరి, కృష్ణరావు ప్రకటించారు.. ఈ చిత్రానికి డి కుమార్ రాజేంద్ర దర్శకత్వం వహించబోతున్నట్లు కూడా అప్పట్లో హడావుడి చేసారు.

ఏ విధమైన విమర్శలు, వివాదాలు లేకుండా ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆసక్తి కరంగా నిర్మించడమే కాకుండా తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక ప్రత్యేక తరహా చిత్రంగా గుర్తింపు పొందేలా రూపొందిస్తున్నామని వారు చెప్పడంతో మహానటుడి జీవిత చరిత్రను వెండితెరపై చూడబోతున్నామని అభిమానులు సంబరపడ్డారు. అయితే ఇప్పటి వరకు సినిమా కార్యరూపం దాల్చులేదు.

NTR's biopic 'Maha Ghanudu' movie cancelled?

ఈ చిత్రానికి నటీనటులను ఎంపిక చేసిన దాఖలులా కూడా ఇప్పటి వరకు లేవు. కేవలం పబ్లిసిటీ కోసమే అప్పట్లో అన్న ఎన్టీఆర్ పేరు వాడుకుని కొందరు ఈ సినిమా ప్రకటన చేసినట్లు పరిస్థితి చూస్తే స్పష్టమవుతోంది. పైగా ఈ చిత్రం నిర్మాణం ద్వారా వచ్చిన మొత్తాన్ని నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి విరాళంగా నారా చంద్రబాబు నాయుడికి అందజేస్తామని తెగ హడావుడి చేయడం కొసమెరుపు.

ఈ చిత్రానకి ఛాయాగ్రహణం: మురళి, ఎడిటింగ్: బద్రి, మాటలు, పాటలు: అంచుల నాగేశ్వరరావు, జొన్నలగడ్డ క్రిష్ణ, కో డైరెక్టర్స్: పవన్ సాయి, అంచుల నాగేశ్వరరావు, జై, సంగీతం: ఉదయ్ ముద్గల్, నిర్మాతలు: డి. అనిల్ సుధాకర్, ఎన్.బి. చౌదరి, కృష్ణరావు, దర్శకత్వం: డి కుమార్ రాజేంద్ర..... అంటూ ప్రకటించడంతో అంతా సినిమా నిజంగానే వస్తుందని అనుకున్నారు. కానీ సినిమా మొదలు కాక పోవడాన్ని బట్టి చూస్తే ఇదంతా ఉత్తిదే అనే అనే సందేహం సర్వత్రా వ్యక్తమవుతోంది.

English summary
JK Movies banner is planning a Telugu feature film based on the life of legendary tollywood actor and ex-Chief Minister of Andhra Pradesh. Film Nagar source said that the biopic was cancelled.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu