»   » ఎన్టీఆర్ 'ఇగో' డైలాగు గురించే చర్చ(వీడియో)

ఎన్టీఆర్ 'ఇగో' డైలాగు గురించే చర్చ(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌ : "నీకు ఇగో లోపలే ఉంటుందేమో...నాకు వైఫై లాగ చుట్టు ఉంటుంది ", అంటున్నాడు ఎన్టీఆర్. ఈ ఇగో ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులను బాగా అలరిస్తోంది. ఈ డైలాగు ని ఎన్టీఆర్ తాజా చిత్రం టెంపర్ ట్రైలర్ లో వదిలారు. ప్రకాష్ రాజ్ తో ఈ డైలాగుని ఎన్టీఆర్ చెప్తాడు.

జూనియర్‌ ఎన్టీఆర్‌, కాజల్‌ అగర్వాల్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'టెంపర్‌'. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి బండ్ల గణేశ్‌ నిర్మాత. అనూప్‌రూబెన్స్‌ సంగీతాన్ని అందించారు. వచ్చే నేల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ట్రైలర్ వీడియోను విడుదల చేసారు. ఈ వీడియోను ఇక్కడ వీక్షించండి.ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఈ చిత్రంపై పూరిజగన్‌ మార్క్‌ కనిపిస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పూరి మార్క్‌కి ఎన్టీఆర్‌ డైలాగులు తోడయితే ఎలా ఉంటుందో చూపించేదే ఈచిత్రం. ఫుల్‌లెంగ్త్‌ కమర్షియల్‌, మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన ముద్దుగుమ్మ కాజల్‌ నటిస్తుంది. బండ్ల గణేష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి మొదటివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పూరిజగన్నాథ్‌, ఎన్టీఆర్‌ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు.


NTR's Ego Dialogue In Discussion

మరో ప్రక్క ఓ ప్రముఖ చానల్ ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని దక్కించుకుందని తెలుస్తోంది. 7.7 కోట్లకు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని ఆ చానల్ దక్కించుకుందట. ఇది భారీ ఆఫర్. ఎన్టీఆర్ గత చిత్రాలతో పోల్చితే 'టెంపర్' భారీ శాటిలైట్ ఆఫర్ ని దక్కించుకుంది. సినిమాపై నెలకొన్న అంచనాలే ఈ రేంజ్ శాటిలైట్ ఆఫర్ రావడానికి కారణమని పరిశీలకులు అంటున్నారు.

English summary
Apparently there is a dialogue in the movie 'Temper' where young tiger NTR talks about his 'ego'. This dialogue is now in rage among fan circles are they are stunned by it.
Please Wait while comments are loading...