»   »  కేక పెట్టించారు : ఎన్టీఆర్ “జనతా గ్యారేజ్” ఫస్ట్ లుక్

కేక పెట్టించారు : ఎన్టీఆర్ “జనతా గ్యారేజ్” ఫస్ట్ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ముందుగా చెప్పినట్లుగానే ఎన్టీఆర్ ఒకరోజు ముందుగానే తన ఫ్యాన్స్ కు పుట్టినరోజు ట్రీట్ ఇచ్చేశాడు. తన తాజా చిత్రం ఫస్ట్ లుక్ ను 'జనతా గ్యారేజ్' ఫస్ట్ లుక్ ని ఎన్టీఆర్ గురువారం తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ నెల 20న (శుక్రవారం) ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కు జనతా గ్యారేజ్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశాడు. గడ్డంతో బైక్ పై మాస్ లుక్ తో కనిపించిన ఎన్టీఆర్ పోస్టర్ అదుర్స్ అనిపించేలా ఉంది.

ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. సమంత, నిత్యమేనన్‌ హీరోయిన్స్. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. మోహన్‌లాల్‌ కీలక పాత్రధారి. ప్రస్తుతం హైదరాబాద్‌ శివార్లలో చిత్రీకరణ జరుగుతోంది. ఎన్టీఆర్‌, సమంత, సితార, సురేష్‌పై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.

Ntr's Janatha Garage: First look released today

'జనతా గ్యారేజ్‌' ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయడానికి ఎన్టీఆర్‌పై ప్రత్యేకంగా ఓ ఫొటో షూట్‌ నిర్వహించారని తెలుస్తోంది. ఆగస్టు 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.

కొరటాల శివ సైతం మరో పోస్టర్ ని తన ట్విట్టర్ ఎక్కౌంట్ ద్వారా షేర్ చేసారు..

English summary
The first look of NTR's 'Janatha Garage' is here. As NTR celebrates his birthday tomorrow (May 20), the first look posters were released.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu