»   » టూ ఫన్నీ : జూ. ఎన్టీఆర్ ఇంగ్లీష్ డైలాగులు...(వీడియో)

టూ ఫన్నీ : జూ. ఎన్టీఆర్ ఇంగ్లీష్ డైలాగులు...(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :ఎన్టీఆర్, హన్సిక జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన 'కంత్రి' సినిమా గుర్తుండే ఉండి ఉంటుంది. ఇప్పుడీ సినిమా ఇంగ్లీష్ లోకి సైతం డబ్బింగ్ అయ్యింది. జాకాల్ టైటిల్ తో రూపొందిన ఈ చిత్రంలో ఎన్టీఆర్..ఇంగ్లీష్ లో చెప్పే డైలాగులు చూసే వారికి చాలా ఫన్నీగా ఉన్నాయి. చూడండి ఈ క్రింద లింక్ ద్వారా.... ఎంత పూర్ గా డబ్ చేసారో.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ చిత్రం ముల్లును ముల్లుతోనే తీయాలి అన్న పాయింటుతో...పగ ప్రతీకారం ..బ్యాక్ డ్రాప్ లో వచ్చిన మాస్ మసాలా చిత్రం కంత్రి. అనాధైన క్రాంతి(ఎన్టిఆర్) ఓ కంత్రి. అవసరార్ధం పి.ఆర్ (ప్రకాష్ రాజ్)మాఫియా గ్యాంగులో చేరి..అతనికే ఎదురు తిరుగుతాడు.ఈ లోగా అనుకోకుండా పి.ఆర్ అతని తండ్రి అన్న విషయం బయిటపడుతుంది.దాంతో క్రాంతి ఏం చేసాడు.పి.ఆర్ ఎలా రెస్పాండ్ అయ్యాడు..క్రాంతి ..కంత్రి అని ఎలా అనిపించుకుంటాడనేది మిగతా కథ.

ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న చిత్రాల విషయానికి వస్తే..

 Ntr's Kantri as Jackal in English!

జూ ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్లో ఓ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సి ఉండగా ఇంకా మొదలు కాలేదు.

ఎన్టీఆర్, సుకుమార్ తొలి కాంబినేషన్ లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా పతాకంపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ భారీ చిత్రం పూజా కార్యక్రమాలు గతేడాది డిసెంబర్ 18 ఉదయం 11.39 గంటలకు సంస్ధ కార్యాలయం చెన్నైలో జరిగాయి. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది.

చిత్రానికి దండయాత్ర అనే టైటిల్ ని పెట్టే అవకాసం ఉందని తెలుస్తోంది. ఇది దండయాత్ర...దయాగాడి దండయాత్ర అనేది పాపులర్ కావటంతో దండయాత్ర అనేదే ఫిక్స్ చేసే అవకాసం ఉందని చెప్పుకుంటున్నారు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఎన్టీఆర్‌ తండ్రిగా జగపతిబాబు నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. సుకుమార్‌ తరహాలో వైవిధ్యంగా సాగే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో ఎన్టీఆర్‌ గెటప్‌ సరికొత్తగా ఉంటుందని తెలుస్తోంది.

English summary
Jr NTR starrer 'Kantri' has been dubbed in English as 'Jackal'.
Please Wait while comments are loading...