»   » 'నాన్నకు ప్రేమతో' సాంగ్ లీకైంది..ఇదిగో

'నాన్నకు ప్రేమతో' సాంగ్ లీకైంది..ఇదిగో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సాంగ్ లు, ఫుటేజి లీక్ అవటం ఇప్పుడు కామన్ గా మారింది. ముఖ్యంగా పెద్ద సినిమాలకు ఇదో సమస్యగా మారింది. తాజాగా ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'నాన్నకు ప్రేమతో'. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం ఆడియో ట్రాక్ లీక్ అయ్యి హాట్ టాపిక్ గా మారింది.

ఈ లీకైన ఆడియో సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో ఓ రేంజిలో ప్రమోట్ చేస్తున్నారు. ఈ ట్రాక్ విన్న వారంతా చాలా బాగుందని అంటున్నారు. మీరు వినండి.రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే అత్యంత కాస్ట్‌లియస్ట్‌ చిత్రంగా 'నాన్నకు ప్రేమతో' చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా చాలా లావిష్‌గా చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు సుకుమార్‌ టెక్నికల్‌గా చాలా హై స్టాండర్డ్స్‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.


ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్‌లో ఎన్టీఆర్‌ చేసిన డాన్స్‌, స్టైల్‌ని అనుకరిస్తూ.. పలువురు అభిమానులు రూపొందించిన వీడియోలతో చిత్ర యూనిట్ ఓ వీడియోని తమ ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా విడుదల చేసింది. ఎన్టీఆర్‌ టైటిల్‌ నాన్నకు ప్రేమతో అయితే.. అభిమానుల టైటిల్‌ ఎన్టీఆర్‌కు ప్రేమతో కావడం విశేషం.


Thanks for the love :) #NannakuPrematho


Posted by Sri Venkateswara Cine Chitra on 23 December 2015

ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం విదేశాల్లోనే జరిగింది. 60 రోజులపాటు లండన్‌లో షూటింగ్ జరిగింది. తర్వాత స్పెయిన్ లోని రేర్ లొకేషన్లలో షూటింగ్ జరిపారు.


ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.

English summary
Ntr's Nannaku Prematho film’s movie audio track leaked.
Please Wait while comments are loading...