»   » ఎన్టీఆర్ కంటే ముందే కథని అభిషేక్ కి అమ్మేసాడట... కోనా అసలు ఇలా ఎందుకు చేసారంటే

ఎన్టీఆర్ కంటే ముందే కథని అభిషేక్ కి అమ్మేసాడట... కోనా అసలు ఇలా ఎందుకు చేసారంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

'జనతా' బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో హ్యాట్రిక్ హిట్టుని సక్సెస్ పుల్ గా కంప్లీట్ చేయాడానికి 'ఎన్టీఆర్' జాగ్రత్తలు తీసుకుంటున్నాడడు. వరుసగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఏ డైరెక్టర్ కథలు చెప్పినా వినేస్తున్నాడు. కానీ ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ కూడా యంగ్ టైగర్ ని ఒప్పించలేకపోయాడనే టాక్ వినిపిస్తోంది. అయితే 'సర్దార్' తో ఖంగుతిన్న 'బాబీ' చెప్పిన స్టోరీ మాత్రం 'ఎన్టీఆర్' శాటిస్ఫై అయినట్లు సమాచారం.

'సర్దార్ గబ్బర్ సింగ్' డిజాస్టర్ తో షాక్ అయిన 'బాబీ' ఒక్క ఛాన్స్ అంటూ చాలా మంది హీరోలకు స్టోరీలు చెబుతున్నాడంట. 'రవితేజ' కోసం ఓ కథ రెడీ చేసి బడ్జెట్ ప్రాబ్లమ్స్ తో పక్కన పెట్టేశాడు. ఇప్పుడు 'ఎన్టీఆర్' కోసం ఈ దర్శకుడు ఓ పవర్ పుల్ స్టోరీని సిద్దం చేసి వినిపించాడంట. రీసెంట్ గా 'ఎన్టీఆర్' ను కలిసిన 'బాబీ'.. ఓ పవర్ ఫుల్ యాక్షన్ స్టోరీ వినిపించాడంట. స్టోరీ లైన్స్ విన్న 'ఎన్టీఆర్' వెంటనే పూర్తి స్టోరీని తీసుకురమ్మని చెప్పాడట.

NTR's Next Movie with Bobby rights with Abhishek Bachchan

ఎట్ట‌కేల‌కు ఎన్టీఆర్ స్టోరీ ఫైన‌ల్ చేసారు ఇక బాబీ డైరెక్ష‌న్ లో సినిమా త్వ‌ర‌లో ప్రారంభిస్తారు అనుకుంటుంటే...ఈ మూవీకి బాలీవుడ్ హీరో అభిషేక్ బ‌చ్చ‌న్ అభ్యంతరం చెబుతున్నార‌ట‌. ఇదేమిటి...ఎన్టీఆర్ తో బాబీ చేయాల‌నుకుంటున్న మూవీకి అభిషేక్ బ‌చ్చ‌న్ అభ్యంత‌రం చెప్ప‌డం ఏమిటి అనుకుంటున్నారా..? ఈ కథ సెట్స్ పైకి వెళ్లాలంటే అందుకు అభిషేక్ బచ్చన్ ఓకే చెప్పాలనేది తాజా సమాచారం. బాబీ ఎన్టీఆర్ కి చెప్పిన కథ కోన వెంకట్ రాసింది.

ఈ కథను ముందుగానే అభిషేక్ బచ్చన్ కి కోన వినిపించడం .. ఆ కథ నచ్చి అభిషేక్ ఆయనకి అడ్వాన్స్ ఇవ్వడం జరిగిపోయాయి. ఈ కథ సెట్స్ పైకి వెళ్లాలంటే అందుకు అభిషేక్ బచ్చన్ ఓకే చెప్పాలనేది తాజా సమాచారం. బాబీ ఎన్టీఆర్ కి చెప్పిన కథ కోన వెంకట్ రాసింది. ఈ కథను ముందుగానే అభిషేక్ బచ్చన్ కి కోన వినిపించడం .. ఆ కథ నచ్చి అభిషేక్ ఆయనకి అడ్వాన్స్ ఇవ్వడం జరిగిపోయాయి.

NTR's Next Movie with Bobby rights with Abhishek Bachchan

ఎన్టీఆర్ ఓకే అన్న తరువాత కోన వెళ్లి అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తానని అంటే అభిషేక్ ఒప్పుకోవడం లేదట. దాంతో కోన ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ దృష్టికి తీసుకు వెళ్లాడట. ఆయన ఈ విషయాన్ని డీల్ చేస్తున్నాడని అంటున్నారు. అభిషేక్ బచ్చన్ ఓకే అంటే ఈ కథ సెట్స్ పైకి వెళుతుందట .. కుదరదంటే కొత్త కథను వెతుక్కోవల్సి వస్తుందని చెప్పుకుంటున్నారు.

English summary
Recently Kona Venkat has announced that he will be working with Bollywood star Abhishek Bachhan and also sold a story to him. Kona now tried to cancel the agreement of Abhishek Bachhan over that story. Irritated by Kona's acts, Jr Bachhan refused to cancel the deal.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu