»   »  అబ్బే అంటున్నారు...ఎన్టీఆర్ గమనిస్తున్నాడా?

అబ్బే అంటున్నారు...ఎన్టీఆర్ గమనిస్తున్నాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ఫ్యాన్స్ పండగ చేసుకుంటేనే ఏ హీరో కైనా ఆనందం. ఎందుకంటే యావరేజ్ ని సూపర్ హిట్ చేయగల సత్తా ఉన్నవాళ్లు హీరోలే. దీన్ని దృష్టిలో పెట్టుకునే హీరోలు ముందు తమ అభిమానులను టార్గెట్ చేస్తూ తమ చిత్రాల ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్స్ వదిలి మినిమం ప్రేక్షకులను రెడీ చేసుకుంటూంటారు. అవి బాగుంటే వారే పబ్లిసిటీ చేసి సినిమాకి హైప్ తీసుకువస్తూంటారు. రీసెంట్ గా వచ్చిన రేసుగుర్రం,మనం కు ఫస్ట్ లుక్ టీజర్సే బాగా ప్లస్ అయ్యాయి.

అయితే తాజాగా విడుదలైన 'రభస' ఫస్ట్ లుక్ టీజర్ మాత్రం ఏ మాత్రం ఆకట్టుకోలేదని టాక్. సినిమాలో ఎంతైనా విషయం ఉండవచ్చు కాక, ఫస్ట్ లుక్ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది కదా అని వాపోతున్నారు. రెగ్యులర్ ఎన్టీఆర్ సినిమాలాగ ఓ యాక్షన్ బిట్ తో కానిచ్చేయటం అందరినీ నిరాశపరిచింది. ఈ విషయం ఎన్టీఆర్ గమనిస్తున్నాడో లేదో అంటున్నారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజాచిత్రం 'రభస'. సమంత, ప్రణీత ఎన్టీఆర్‌కు జోడీగా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై బెల్లంకొండ సురేష్‌, బెల్లంకొండ గణేష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్‌తో 'కందిరీగ' తీసి తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న సంతోష్‌ శ్రీనివాస్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

NTR's Rabhasa First Look Teaser Disappointed

చిత్ర సమర్పకుడు బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ ''ఆది' తరవాత ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్న చిత్రమిది. దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్న విధానం బాగుంది. ఎన్టీఆర్‌ డ్యాన్సులు, పోరాటాలు అభిమానులకు థ్రిల్‌ కలిగిస్తాయి'' అన్నారు.

దర్శకుడు చెబుతూ ''ఎన్టీఆర్‌ అభిమానులకు ఈ సినిమా పండగలా ఉంటుంది. ఆయనతో పనిచేయడం సంతోషంగా ఉంది. తమన్‌ చక్కటి పాటలిచ్చారు''అన్నారు. సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'రభస'. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేయబోతున్నారు.

ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్‌ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

English summary
The first look teaser of the actor's upcoming film "Rabhasa" released on 20 May, as a special birthday treat for his fans. But it's disappointed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu