»   »  ఘనంగా 'టెంపర్‌' సక్సెస్‌ మీట్‌....(ఫొటోలు)

ఘనంగా 'టెంపర్‌' సక్సెస్‌ మీట్‌....(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌, కాజల్‌ జంటగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'టెంపర్‌'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లోని హోటల్‌ ఆవాసాలో సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేసింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ కార్యక్రమంలో కేక్‌ కట్‌ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. హీరో ఎన్టీఆర్‌ చిత్రానికి పనిచేసిన నటులు, సాంకేతిక నిపుణులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు పూరి జగన్నాథ్‌, ప్రకాష్‌రాజ్‌, సచిన్‌ జోషి, నిర్మాత బండ్ల గణేష్‌, సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ , వక్కంతం వంశీ తదితరులు పాల్గొన్నారు.

బాక్సాఫీసు దగ్గర వసూళ్ల దండయాత్ర చేస్తూ తన 'టెంపర్‌' చూపిస్తున్నాడు ఎన్టీఆర్‌. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం చక్కటి ఫలితాన్ని రాబట్టింది. దాంతో ఈ చిత్రం నిర్మాత, యూనిట్ ఆనందోత్సాహాల్లో ఉన్నారు.

స్లైడ్ షోలో... సక్సెస్ మీట్ ఫొటోలు

ఎన్టీఆర్‌ మాట్లాడుతూ...

ఎన్టీఆర్‌ మాట్లాడుతూ...

''వసూళ్ల గురించి నేనెప్పుడూ పట్టించుకోలేదు. ఈ సినిమాతో అభిమానుల కళ్లల్లో ఆనందం చూశాను. నా బాధ్యతను మళ్లీ మళ్లీ గుర్తుకు తెచ్చే సినిమా ఇది. మరొకరి కథతో ఈ సినిమా చేద్దాం అనుకొన్నప్పుడే మేం తొలి విజయం సాధించాం.'' అన్నారు.

ఎన్టీఆర్ కంటిన్యూ చేస్తూ..

ఎన్టీఆర్ కంటిన్యూ చేస్తూ..

ఈ కథను పూరి జగన్నాథ్‌ కంటే గొప్పగా మరెవ్వరూ తీయలేరు. ఇలాంటి సినిమాలు ఇంకా వచ్చి తెలుగు పరిశ్రమను మరో స్థాయికి తీసుకెళ్లాలి అని చెప్పారు.

భాధ్యతను..

భాధ్యతను..

ఎన్టీఆర్ కంటిన్యూ చేస్తూ... ఎన్టీఆర్‌ బాగా చేశాడని అందరూ అంటున్నారు. అయితే నేను చేసిందేమీ లేదు. నా చుట్టూ ఉన్నవాళ్లంతా నా బాధ్యతను గుర్తు చేశారు. ప్రకాష్‌రాజ్‌ నా వెన్నంటే ఉన్నారు. ఈ రోజు మాతృభాష దినోత్సవం. రోజూ ఏ భాషలో మాట్లాడినా కనీసం ఈ రోజయినా మనదైన భాషలో మాట్లాడదాం. దేశభాషలందు తెలుగు లెస్స అని చెప్పారు.

అర్హతను కల్పించింది

అర్హతను కల్పించింది

''విజయం అందించడమే కాదు. సమాజంలో మా అందరికీ ఓ అర్హత కల్పించిన సినిమా ఇది. మా బాధ్యతను మరింత పెంచింది'' అన్నారు ఎన్టీఆర్‌.

 చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ....

చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ....

''జీవితం అందరి సరదా తీర్చేస్తుంది అని ఈ సినిమాలో ఓ సంభాషణ రాశాను. అదే జీవితం ఓ మంచి విజయాన్ని కూడా ఇస్తుందని మా 'టెంపర్‌' నిరూపించింది. సినిమా చూశాక దర్శకులంతా ఫోన్‌ చేసి అభినందించారు. హీరోలందరూ ఫోన్లు చేసి తారక్‌ని తెగ పొగిడారు.'' అన్నారు.

పూరి కంటిన్యూ చేస్తూ...

పూరి కంటిన్యూ చేస్తూ...

విజయం, డబ్బే కాదు... విలువ కూడా పెంచిన సినిమా ఇది. అందరి కష్టం ఈ సినిమా. అందరి విజయం ఈ సినిమా. ఎన్టీఆర్‌ ఎప్పుడు పిలిస్తే అప్పుడు మరో సినిమా తీయడానికి మేమంతా రెడీగా ఉన్నాం'' అన్నారు.

నటుడు ప్రకాష్‌రాజ్‌ మాట్లాడుతూ ...

నటుడు ప్రకాష్‌రాజ్‌ మాట్లాడుతూ ...

''మానవ సంబంధాలు, అనుబంధాల్ని గొప్పగా చూపించిన సినిమా ఇది. సమాజంపై కసిని పెంచుకొన్న ఒక అనాథ తన ప్రయాణంలో తన తల్లిని, చెల్లిని, తండ్రిని ఎలా సంపాదించుకొన్నాడు? ఎలా మనిషయ్యాడన్నది కథ. ఇంత మంచి కథ ఎప్పుడూ తప్పు చేయదని నమ్మాను. ఈ విజయానికి పూరి, ఎన్టీఆర్‌ అర్హులు. '' అన్నారు.

 ఎన్టీఆర్ ని అడిగా...

ఎన్టీఆర్ ని అడిగా...

కొన్ని కథల్ని అనవసరంగా ఎందుకు మోస్తున్నావు? ఇలా ఎంతకాలం? అని ఎన్టీఆర్‌ని చాలాసార్లు అడిగాను. ఒక స్టార్‌గా కాదు, ఒక నటుడిగా గెలిస్తే తనని చూడాలనుకొన్నా. ఆ కోరిక ఈ సినిమా తీర్చింది అని చెప్పుకొచ్చారు ప్రకాష్ రాజ్.

అనూప్‌ రూబెన్స్‌ మాట్లాడుతూ...

అనూప్‌ రూబెన్స్‌ మాట్లాడుతూ...

''ఎన్టీఆర్‌ ఉత్సాహం నా పాటల్ని తెరపై మరింత అందంగా చూపించింది'' అన్నారు.

కథా రచయిత వక్కంతం వంశీ మాట్లాడుతూ...

కథా రచయిత వక్కంతం వంశీ మాట్లాడుతూ...

''కథ కథగానే తెరపై కనిపించింది. ఈ సినిమాతో దొరికిన మర్యాద, గౌరవం గతంలో ఎప్పుడూ దొరకలేదు. ఈ విజయం ఓ టానిక్‌లా పనిచేస్తుంది'' అన్నారు.

బండ్ల గణేష్‌ మాట్లాడుతూ...

బండ్ల గణేష్‌ మాట్లాడుతూ...

''ఈ సినిమాని ఇప్పటి వరకు యాభైసార్లు చూశాను. కోర్టు సన్నివేశాల్లో ఈ ఎన్టీఆర్‌ని చూస్తుంటే పెద్ద ఎన్టీఆరే గుర్తొచ్చారు. 'టెంపర్‌' ఆడకపోతే అసలు సినిమాలే తీయకూడదనుకొన్నా. కానీ యేడాదికి రెండు సినిమాలు తీసేంత ధైర్యం ఇచ్చింది ఈ సినిమా. అందరి ఆశీస్సులతో 'టెంపర్‌2' తీస్తా'' అన్నారు.

ఎవరెవరు...

ఎవరెవరు...

ఈ కార్యక్రమంలో సచిన్‌జోషి, భాస్కరభట్ల రవికుమార్‌, కందికొండ, విజయ్‌, వాకాడ అప్పారావు, బ్రహ్మకడలి, శ్యామ్‌.కె.నాయుడు, విశ్వ తదితరులు పాల్గొన్నారు.

మరో ప్రక్క....

మరో ప్రక్క....


'ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరికొత్తగా కనిపిస్తున్నాడ'అంటూ అభిమానులు సంబర పడిపోతున్నారు. దయాగా ఎన్టీఆర్‌ నటన బాగుందంటూ సినీ ప్రముఖులు కితాబులు ఇస్తున్నారు.

మళ్లీ వస్తాడు

మళ్లీ వస్తాడు

అందుకే ఇప్పుడు దయ మళ్లీ రాబోతున్నాడు. విషయమేంటంటే.. 'టెంపర్‌' సీక్వెల్‌ తీసుకురావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని నిర్మాత బండ్ల గణేష్‌ అధికారికంగా ధ్రువీకరించారు కూడా.

టెంపర్ 2

టెంపర్ 2

''ప్రస్తుతం 'టెంపర్‌' అందించిన విజయానందంలో ఉన్నాం. ఈ చిత్రం ఇచ్చిన నమ్మకంతో సీక్వెల్‌కూ రంగం సిద్ధం చేస్తున్నాం. మా టీమ్‌ మళ్లీ ఓ మంచి సినిమా అందివ్వబోతోంది'' అని చిత్ర బృందం చెబుతోంది. ఎన్టీఆర్‌ రాబోయే చిత్రాల జాబితాలో 'టెంపర్‌ 2' కూడా చేరిపోయిందన్నమాట.

హిట్ టాక్...

హిట్ టాక్...

ఎన్.టి.ఆర్ సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ కనిపించిన ఈ సినిమాలో మధురిమ, సోనియా అగర్వాల్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. బండ్ల గణేష్ భారీ వ్యయంతో నిర్మించిన ఈ సినిమా హిట్ టాక్ తో ముందుకు వెళ్తోంది.

హాట్రిక్

హాట్రిక్

ఎన్టీఆర్‌, కాజల్‌ కాంబినేషన్‌లో వచ్చిన బృందావనం, బాద్‌షా, రెండు హిట్‌లు సాధించగా టెంపర్‌తో హాట్రిక్‌ కొట్టారు.

రికార్డు

రికార్డు

ఓపెనింగ్ డే ఈ చిత్రం రూ. 9.68 కోట్ల షేర్ వసూలు చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూడో సినిమాగా రికార్డుల కెక్కింది

ఫెరఫార్మెన్స్...

ఫెరఫార్మెన్స్...

ఎన్టీఆర్ పర్ ఫుల్ పెర్ఫార్మెన్స్, పూరి డైరెక్షన్, డైలాగులు సినిమాకు ప్లస్ అయ్యాయి. ఎన్టీఆర్-కాజల్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు సైతం ప్రక్షకులను కట్టిపడేస్తున్నాయి

తెర ముందు...

తెర ముందు...

కాజల్‌ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర పాత్రధారులు.

తెర వెనక

తెర వెనక

ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్‌ కె నాయుడు, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్‌, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

English summary
The success meet of 'Temper' was held at Hotel Avasa in Hyderabad. NTR, Puri Jagannadh, Sachin Joshi, Prakash Raj, Bandla Ganesh, Vakkantham Vamsi, Anoop Rubens etc attended the event. Vakkantham Vamsi's birthday was also celebrated on the stage.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu