»   » జై లవకుశ గురించి ఎన్టీఆర్ ఆసక్తికరమైన ట్వీట్

జై లవకుశ గురించి ఎన్టీఆర్ ఆసక్తికరమైన ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

దర్శకుడు బాబీ పర్యవేక్షణలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ సోదరుడు కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రాశీ ఖాన్నా, నివేదా థామస్ జంటగా నటిస్తున్నారు.

జై లవకుశ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం పుణెలో జరుగుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన సెట్ ఫోటోలను ఎన్టీఆర్‌ ట్విట్టర్‌లో షేర్ చేశారు. 'నైపుణ్యం కలిగిన బృందంతో పుణెలో శరవేగంగా జేఎల్‌కే (జై లవ కుశ) షూట్‌ జరుగుతున్నది' అని ఎన్టీఆర్ ట్వీట్‌ చేశారు. బిగ్‌బాస్ షో లో పాల్గొనేందుకు వీలుగా జై లవకుశ షూటింగ్‌ను పుణెలో పెట్టుకొన్నట్టు తెలుస్తున్నది.
English summary
Junior NTR is now happy go lucky man in tollywood. Recently, He started Biggboss reality show in television. Now he is shooting for Jai Lava Kusa in Pune. NTR tweet Jai Lava Kusa set photos in twitter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu