»   »  ఎన్టీఆర్ అర్దరాత్రి షాకింగ్ ట్వీట్స్..

ఎన్టీఆర్ అర్దరాత్రి షాకింగ్ ట్వీట్స్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జూ.ఎన్టీఆర్ ట్విట్టర్ ఎక్కౌంట్ నుంచి నిన్నటి అర్దరాత్రి షాకింగ్ ట్వీట్స్ వచ్చి అభిమానులను కంగారు పెట్టాయి. ఎన్టీఆర్ తాజా చిత్రం నాన్నకు ప్రేమతో చిత్రం గురించి ఆ ట్వీట్స్ . చిత్రం రిలీజ్ , ఆడియో విడుదల తేదీ గురించి వచ్చిన ఆ ట్వీట్స్ చూసి ఫ్యాన్స్ అంతా కన్ఫూజన్ కు గురి అయ్యారు.

ఆ ట్వీట్స్ ఇలా సాగాయి...

' చాలా రోజులుగా అభిమానులు... సినిమా రిలీజ్, ఆడియో రిలీజ్ ల గురించి అడుగుతున్నారు. ఆ విషయం నాకు తెలుసు అనే అనుకుంటున్నారా..? సినిమా విషయంలో ఏ జరుగుతుందో నాకు కూడా తెలీదు'

NTR Tweets Shocking Statement Midnight, Says Account Hacked

అంటూ వచ్చిన ట్వీట్ అందరినీ షాక్ కు గురి చేసింది అంతే కాకుండా ఈ ట్వీట్ పోస్ట్ అయిన కొద్ది సేపటికే డిలీట్ అయ్యింది. మళ్లీ తిరిగి పోస్ట్ అవ్వటం మళ్లీ డిలీట్ అవ్వటం అభిమానులను చాలా కన్ఫ్యూజ్ చేసింది.

NTR Tweets Shocking Statement Midnight, Says Account Hacked

కాస్సేపటికి ఈ విషయంపై ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చాడు. తన ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ అయినట్టుగా తన టీం గుర్తించింది, ఏం జరిగిందో తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నాం.


నా ఎకౌంట్ పూర్తిగా నా కంట్రోల్ లోకి వచ్చిన తరువాత తిరిగి అభిమానులతో మాట్లాడతాను అంటూ ట్వీట్ చేశాడు.

సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న 'నాన్నకు ప్రేమతో' సినిమాను ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేయాలని పట్టుదలగా ఎన్టీఆర్ ఉన్నారు. అందుకు తగినట్లు ప్లాన్ చేసుకుని , విరామం లేకుండా పని చేస్తున్నారు.

ముఖ్యంగ అదే విడుదల సమయానికి బాలకృష్ణ హీరోగా నటించిన డిక్టేటర్ రిలీజ్ కూడా ఉండటంతో ..నాన్నకు ప్రేమతో వాయిదా పడే అవకాసం ఉందని కూడా గత కొద్ది రోజులుగ వినిపిస్తోంది. వెనక్కి తగ్గుతాడో లేదో చూడాలి.

ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.

English summary
"Fans have been asking the dates of Nannaku Prematho audio and movie release. I wish I knew when it is! I have no clue what is happening.", tweeted NTR, which he deleted after a while. After a few minutes, he tweeted the same thing, which he again deleted. This panicked fans as the tweets hinted a problem between the producer and the hero.
Please Wait while comments are loading...