»   » ఎనీ డౌట్స్ : జూ. ఎన్టీఆర్.. నా శ్రీకృష్ణుడు: రాజమౌళి

ఎనీ డౌట్స్ : జూ. ఎన్టీఆర్.. నా శ్రీకృష్ణుడు: రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్, యమదొంగ, సింహాద్రి చిత్రాలు ఎంత ఘన విజయం సాధించాయో తెలిసిందే. అయితే ఆ తర్వాత వీరి కాంబనేషన్ కుదరలేదు. అయితే మళ్లీ వీరి కాంబినేషన్ అయ్యే అవకాసం ఉంది. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా వెళ్లడించారు.

రాజమోళి ఓ టీవీ ఛానెల్ తో బాహుబలి ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ... ఈ విషయం వెళ్లడించారు. తనకు మహాభారతం డ్రీమ్ ప్రాజెక్టు అని, అందులో శ్రీకృష్ణుడు జూ. ఎన్టీఆర్ తో చేయించాలనే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. అయితే ఇక్కడో ట్విస్ట్ రివిల్ చేసారు. తను మహాభారతం మొదలెట్టడానికి మరో పదేళ్ళు సమయం పడుతుందని అన్నారు.

అలాగే రాజమౌళి కంటిన్యూ చేస్తూ.. ఎన్టీఆర్ కు యాక్టింగ్ పవర్స్, వాయిస్ మాడ్యులేషన్, డిక్షన్ వంటి అలాంటి ఛాలెంజింగ్ పాత్రకు ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయన్నారు. ప్రస్తుతం తన దృష్టి అంతా బాహుబలి పార్ట్ 2 మీద ఉందని చెప్పారు.

NTR Will Be My Sri Krishna: Rajamouli on his Dream 'Mahabharatam'

‘బాహుబలి - ది కంక్లూజన్' విషయానికి వస్తే...

భారీ అంచనాల మధ్య విడుదలైన 'బాహుబలి' చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ నేఫధ్యంలో ఈ చిత్రం సెకండ్ పార్ట్ గురించి అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ఈ నేఫధ్యంలో ఈ సెకండ్ పార్ట్ గురించి కొన్ని విషయాలు బయిటకు వచ్చాయి. అందులో మొదటిది ఈ చిత్రం విడుదల తేదీ. జనవరి 8, 2016 న సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక ఈ సెకండ్ పార్ట్ షూటింగ్ విషయానికి వస్తే...దాదాపు అందరి లీడింగ్ ఆర్టిస్టుల కాల్ షీట్స్ పూర్తి అయిపోయాయని తెలుస్తోంది. ఇంకా VFX వర్క్, ఇరవై రోజుల బ్యాలెన్స్ మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది.

NTR Will Be My Sri Krishna: Rajamouli on his Dream 'Mahabharatam'

'బాహుబలి' రెండో భాగం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికరమైన అంశం. ఈ చిత్రానికి ''బాహుబలి - ది కంక్లూజన్‌' అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో మొదటి భాగంలో ఉన్న సందేహాలు అన్నీ కంక్లూజన్ దొరుకుతుందనే ఈ టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గురించి సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

'బాహుబలి 2' గురించి రానా మాట్లాడుతూ... ''బాహుబలి - ది కంక్లూజన్‌' వచ్చాక 'బాహుబలి - ది బిగినింగ్‌' చాలా చిన్నదిగా కనిపిస్తుంది. రెండో భాగంలో పోరాట సన్నివేశాలు, భావోద్వేగాలు, సెట్లు... ఇలా అన్నీ ఇంకా భారీగా ఉంటాయి''అన్నాడు రానా.

మరో ప్రక్క సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు అయిన ఫేస్ బుక్, ట్విటర్ లో 'బాహుబలి' హవా కొనసాగుతోంది. కెరీర్ లో ఇప్పటివరకు తీసిన తొమ్మిది చిత్రాలలో ఏ ఒక్కటీ ఫ్లాప్ కాలేదు. దాంతో ఈ పదో సినిమా కూడా పాజిటివ్ టాక్ తో రన్ అవటం అందరికీ ఆనందాన్ని కలిగిస్తోంది.

English summary
Rajamouli already revealed that his dream project is to capture the epic Mahabharata on Indian silver screen. However, Rajamouli also said "NTR will be my choice for Sri Krishna in current lot. Depends on when i make it"
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu