»   » రమ్యశ్రీ... హాట్ ఫోజులతో ఊరింపు ఇంకెంతకాలం?

రమ్యశ్రీ... హాట్ ఫోజులతో ఊరింపు ఇంకెంతకాలం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నటి రమ్యశ్రీ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఐటం గర్ల్‌గా, వ్యాంప్ పాత్రల్లో నటిస్తూ అప్పట్టో సినిమాల్లో కనిపించేది. అయితే గత కొంత కాలంగా మాత్రం ఆమె సినిమాల్లో కనిపించడం లేదు. త్వరలో స్వీయ దర్శకత్వంలో 'ఓ మల్లి' అనే సినిమాలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ చిత్రం అప్పుడెప్పుడో 2013లో ప్రారంభమైంది. ఆ మధ్య హాట్ ఫోటోలు రిలీజ్ చేసి ఊరించారు. దాదాపు రెండేళ్ల తర్వాత ఇపుడు ఈ చిత్రం షూటింగ్ పూర్తయినట్లుంది. ఇందులో ఆమె అందాల ప్రదర్శన మాత్రమే కాదు...ప్రేక్షకుల హృదయాలను టచ్ చేసే సబ్జెక్టు కూడా ఉందట. ఆర్.ఎ. ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈచిత్రం ఆడియో ఆవిష్కరణ ఈ నెల 27 హైదరాబద్ లో జరిగనుంది.

సినిమా కథాంశం సంగతి పక్కన పెడితే....పోస్టర్లు మాత్రం యమ హాటుగా డిజైన్ చేసారు. అయితే విడుదల తేదీ మాత్రం ఇంకా ప్రకటించలేదు. పోస్టర్లు చూసిన వారు సినిమా విడుదల చేయకుండా ఇంకెంత కాలం ఊరిస్తారని ప్రశ్నిస్తున్నారు. స్లడ్ షోలో మరిన్ని వివరాలు..

ఓ మల్లి

ఓ మల్లి

ఆర్.ఎ.ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్లో రమ్యశ్రీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓ మల్లి.

నిర్మాత

నిర్మాత

బి.ఎస్. ప్రశాంత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే రమ్యశ్రీ అందించారు.

కథాంశం

కథాంశం

స్త్రీలకు సమాజంలో జరుగుతున్న అన్యాయాలను కథగా ఎంచుకుని రమ్యశ్రీ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు.

ఆడియో

ఆడియో

సునీల్ కశ్యప్-కృష్ణ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఈ ఫిబ్రవరి 27న ప్రసాద్ ల్యాబ్స్ లో జరుగనుంది. ప్రముఖ గాయకుడు జేసుదాసు, చిత్ర పాటలను ఆలపించారు.

అతిథులు

అతిథులు

ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో మార్కెట్లోకి విడుదలవుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకరత్న దాసరి నారాయణరావు, మినిస్టర్ పీతల సుజాత, రావి కిషోర్ బాబు, తెలంగాణ మహిళ స్ట్రేట్ ప్రెసిడెంట్ శోభారాణి హాజరు కానున్నారు.

English summary
Ramyasri coming back with Hot movie O Malli in her own direction. Prashanth produce this movie on RA entertainments banner. Audio releasing on Feb 27th.
Please Wait while comments are loading...