twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బలవంతంగా ‘ఆఫీసర్’ కొనేలా చేశారు.... ఆత్మహత్య దిశగా ఆంధ్రా బయ్యర్!

    By Bojja Kumar
    |

    Recommended Video

    Officer Had A Disaster Talk

    నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆఫీసర్' మూవీ బాక్సాఫీసు వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లకు పెట్టుబడిలో పావు వంతు కూడా తిరిగిరాని దుస్థితి నెలకొంది. ఈ సినిమాను ఆంధ్రా ఏరియాలోని 8 జిల్లాల రైట్స్ కొన్న సుబ్రహ్మణ్యం అనే బయ్యర్ కోట్లు నష్టపోయి రోడ్డునపడే పరిస్థతికి వచ్చాడు. తాజాగా మీడియా ముందుకు వచ్చిన సుబ్రహ్మణ్యం తన గోడు వెల్లబోసుకున్నారు. బలవంతంగా తనతో సినిమా కొనేలా చేశారని, ఆఫీసర్ ప్లాప్ అవ్వడంతో తీవ్రంగా నష్టపోయానని, నిర్మాత ఆదుకోకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశాడు.

    సినిమా కోసం ఫైనాన్స్ చేశాను

    సినిమా కోసం ఫైనాన్స్ చేశాను

    ‘ఆఫీసర్' నిర్మాతలు నా వద్దకు ఫైనాన్స్ కోసం వచ్చారు. వారికి రూ. 1.3 కోట్లు ఫైనాన్స్ చేశాను. సినిమా ఫూర్తయ్యే సమయానికి నా డబ్బు తిరిగి ఇవ్వమని అడిగాను. కానీ వారి నుండి రెస్పాన్స్ లేదు. ఇదేంటని ప్రశ్నిస్తే కోర్టుకు వెళ్లు అని బెదిరించారు అని సుబ్రహ్మణ్యం తెలిపారు.

    బలవంతంగా కొనేలా చేశారు

    బలవంతంగా కొనేలా చేశారు

    కోర్టుకు వెళితే విషయం తేలడానికి చాలా సమయం పడుతుంది, దీని వల్ల తాను నష్టపోవడం తప్ప ఏమీ ఉండదని భావించి..... ఉభయగోదావరి జిల్లాల రైట్స్ ఇప్పించాలని అడిగాను. అయితే రామ్ గోపాల్ వర్మ కేవలం రెండు జిల్లాల రైట్స్ అయితే అమ్మబోము, మొత్తం ఆంధ్రా రీజియన్ రైట్స్ ఒకరికే అమ్మాలని చూస్తున్నామని చెప్పారు. అలా నాతో రూ. 3.50 కోట్లకు ఆంధ్రా రీజియన్ రైట్స్ బలవంతంగా కొనేలా చేశారు అని సుబ్రహ్మణ్యం తెలిపారు.

     ఆ నమ్మకంతో కొన్నా.. కానీ

    ఆ నమ్మకంతో కొన్నా.. కానీ

    నాగార్జున గత చిత్రం ‘రాజుగారి గది 2' ఆంధ్రా ఏరియాలో రూ. 7 కోట్లకుపైగా వసూలు చేసింది. అందులో సగం అయినా రాకపోతుందా అనే నమ్మకంతో సినిమాను మూడున్నర కోట్లకు కొన్నాను. నిర్మాతలకు నేను ఫైనాన్స్ చేసిన డబ్బు తిరిగి రావబట్టుకోవడానికి ఇంతకంటే మార్గం కనిపించలేదు అని సుబ్రహ్మణ్యం తెలిపారు.

    నాకు ఆత్మహత్యే శరణ్యం

    నాకు ఆత్మహత్యే శరణ్యం

    ఆఫీసర్ మూవీ సరిగా ఆడకపోతే అఖిల్‌తో చేయబోయే తర్వాతి సినిమా కూడా నీకే ఇప్పిస్తానని వర్మ అన్నారు. కానీ అఖిల్ మూవీ ప్రకటన వెనక ‘ఆఫీసర్' మార్కెటింగ్ స్ట్రాటజీ తప్ప ఆ సినిమా వచ్చే అవకాశం లేదని స్పష్టం అవుతోంది. నా డబ్బంతా పోయింది. నాకు ఆత్మహత్య తప్ప మరో దారి లేదు అని సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు.

    English summary
    Officer starring Akkineni Nagarjuna and Myra Sareen, directed by Ram Gopal Varma, has declared as the biggest disaster and the buyer Subramanyam who has lost entire investment, is saying, “The makers of Officer did not leave any choice for me so I have decided to commit suicide”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X