»   »  'బాహుబలి' కాన్సెప్టు స్కెచ్ లు కావాలా? ఇవిగో...

'బాహుబలి' కాన్సెప్టు స్కెచ్ లు కావాలా? ఇవిగో...

Written By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి'. తెలుగుతో పాటు, తమిళం, హిందీ, మళయాలం బాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ సంచలన చిత్రంగా నిలిచింది. రూ. 600 కోట్లకుపైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.

ఈ చిత్రం అఫీషియల్ కాన్సెప్ట్ స్కెచ్ లను ..సేకరించే వారి కోసం అమ్మకానికి పెట్టింది బాహుబలి టీమ్. ఈ మేరకు వారు వెబ్ సైట్ లో రేట్లు లతో నమూనా పోస్టర్ లు పెట్టారు. ఈ విషయానికి సంభందించిన పోస్ట్ ని ట్విట్టర్  లో పెట్టారు.

మరో ప్రక్క తెలుగులో రూపొంది ఖండాతరాలు దాటి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందితోంది 'బాహుబలి'. ఈ చిత్రం ప్రస్తుతం లాటిన్‌ అమెరికా దేశాల్లో విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ సినిమా డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ 'సన్‌' ఈ చిత్రానికి సంబంధించిన లాటిన్‌ అమెరికా హక్కులను సొంతం చేసుకుంది.


విడుదలవడమే భారీగా విడుదలైన ఈచిత్రం 100 రోజుల పాటు విజయవంతంగా ప్రదర్శితం అయి కలెక్షన్ల సునీమీ సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా బిజినెస్ దాదాపుగా క్లోజ్ అయింది. దర్శకుడు రాజమౌళి కూడా రికార్డుల కోసం సినిమాను ఎక్కువ రోజులు నడిపించాలనే ఉద్దేశ్యం తమకు లేదని, కలెక్షన్లు వచ్చే కొన్ని చోట్ల మాత్రమే ప్రదర్శిస్తామని గతంలోనే ప్రకటించారు.

తెలుగులో ‘బాహుబలి' మూవీ బిజినెస్ పూర్తవడంతో కలెక్షన్ వివరాలు బయటకు వచ్చాయి. ఒక తెలుగు వెర్షన్ చిత్రమే రూ. 172 కోట్లకుపైగా షేర్ వసూలు చేసింది. తెలుగులో సినిమా చరిత్రలో ఈ రేంజిని అందుకునే సత్తా త్వరలో రాబోయే ‘బాహుబలి-2' సినిమాకు తప్ప మరే సినిమాకు లేదని చెప్పడంలో సందహం లేదు.

English summary
For the collectors and art enthusiasts, for the first time ever, official #Baahubali "Concept Sketches" are now on.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu