»   » ప్రెస్‌మీట్లో హీరోయిన్‌ కనిపించకుండా ముసుగేసారు (ఫోటోలు)

ప్రెస్‌మీట్లో హీరోయిన్‌ కనిపించకుండా ముసుగేసారు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్లో మనోజ్ నందన్, అనిల్ కళ్యాణ్, ప్రియాంక దివ్య నటీనటులుగా తెరకెక్కబోతున్న సినిమా 'ఒక క్రిమినల్ ప్రేమకథ'. కృష్ణ మూర్తి సమర్పణలో యక్కాలి రవీంద్రబాబు నిర్మాతగా పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమా డిజిటల్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో జరిగింది. ఇటీవల ఈచిత్రానికి సంబంధించిన పోస్టర్లు విడుదలయ్యాయి. అందులో హీరోయిన్ల ఫేసు కనిపించకుండా ముసుగు వేసారు. తాజాగా ప్రెస్ మీట్‌కు హాజైన హీరోయిన్ కూడా తన మొహం కనిపించకుండా ముసుగు వేసుకుని కనిపించింది.

సినిమా విడుదలయ్యే వరకు హీరోయిన్ ఎవరో సస్పెన్స్‌గా ఉంచాలనే ఉద్దేశ్యంతోనే ఆమె ముఖానికి ముసుగు వేసినట్లు స్పష్టమవుతోంది. స్లైడ్ షోలో ప్రెస్ మీట్‌కు సంబంధించిన ఫోటోలు...

యూత్ ఫుల్ మూవీ

యూత్ ఫుల్ మూవీ

రొమాంటిక్ క్రైమ్ కథ సినిమా తర్వాత ఆ రేంజిలో కాన్సెప్టు ఉన్న సినిమా అని దర్శకుడు సునీల్ కుమార్ తెలిపారు. మనం చాలా విషయాలను ఎవరికీ తెలియకుండా పరదాల వెనక దాస్తుంటాం. అటువంటి విషయాలను ఒక జర్నలిస్టుగా, సొసైటీకి ఏం అవసరం అనేది ఒక పాజిటివ్ వేలో ఈ సినిమా ద్వారా చూపిస్తున్నాం అన్నారు. సినిమాను చాలా బోల్డ్‌గా చిత్రీకరించామని తెలిపారు.

నిర్మాత మాట్లాడుతూ...

నిర్మాత మాట్లాడుతూ...

కథలోని అంశాలపై చాలా రిసెర్చ్ చేసామని, పక్కాగా స్క్రిప్టు రెడీ చేసాం. రొమాంటిక్ క్రైం కథ సినిమా కంటే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నిర్మాత రవీంద్ర బాబు తెలిపారు.

మనోజ్ నందన్ మాట్లాడుతూ..

మనోజ్ నందన్ మాట్లాడుతూ..

రొమాంటిక్ క్రైం కథ తర్వాత అంత డెప్తుగా ఉన్న కథ ఇది. ఈ చిత్రంలో అమ్మాయిలపై యాసిడ్ దాడుల గురించి కూడా ఉంది అన్నారు.

అనిల్ కళ్యాణ్ మాట్లాడుతూ..

అనిల్ కళ్యాణ్ మాట్లాడుతూ..

రొమాంటిక్ క్రైం కథ చిత్రంలో నెగెటివ్ రోల్ చేసాను. అయితే ఈ చిత్రంలో మాత్రం పాజిటివ్ రోల్ చేసాను అని అనిల్ కళ్యాణ్ అన్నారు.

నటీనటులు

నటీనటులు

దివ్య, మన్ ప్రీత్ కౌర్, సత్యానంద్ ఎల్, జి.రమేష్, ఎఫ్.ఎం. బాబాయ్, బుగత సత్యనారాయణ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

సాంకేతిక విభాగం

సాంకేతిక విభాగం

ఈచిత్రానికి కెమెరా: సాబు జేమ్స్, ఎడిటింగ్: అర్చన, సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి, కో-ప్రొడ్యూసర్: కుర్రా విజయ్ కుమార్, నిర్మాత: యక్కాలి రవీంద్రబాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: పి.సునీల్ కుమార్ రెడ్డి.

English summary
Oka Criminal Prema Katha is a Telugu Movie. D Directed by Suneel Kumar Reddy. Gayatri, Divya, Swapna, Manoj and Anil Kalyan are in Lead Roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu