twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒక రాధ ముగ్గురు కృష్ణులు ఆడియో విడుదల

    By Rajababu
    |

    ఎన్ సి సి సమర్పణలో దృవ ఆర్ట్స్ ఫిలిమ్స్ పతాకంపై అభిషేక్, అభి, డి. ఆకాష్ మరియు అనూష వేణుగోపాల్ హీరో హీరోయిన్ గా పరకోటి బాలాజి దర్శకత్వం లో దృవ చరణ్ నిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం 'ఒక రాధ ముగ్గురు కృష్ణులు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం గురువారం ఫిలిం నగర్ లో సినీ ప్రముఖుల అశీసులతో ఘనంగా జరిగింది. ఈ ఆడియో వీడుక కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సంతోషం మ్యాగజిన్ అధినేత సురేష్ కొండేటి, ముత్యాల రాందాస్, శ్రీరంగం సతీష్ కుమార్, మోహన్ గౌడ్ మరియు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గున్నారు. ముఖ్య అతిధులు సి డి ని విడుదల చేసి దర్శకుడు పరకోట బాలాజీ కి, నిర్మాత దృవ చరణ్ కి మరియు హీరో హీరోయిన్ కి వారి బెస్ట్ విషెస్ అందించారు.

    అనంతరం వారు మాట్లాడుతూ "దర్శకనిర్మాతలు ఎంతో శ్రమతో కృషి తో సినిమా ని నిర్మిస్తారు కానీ సినిమా బాగుంటేనే వాళ్లకి ఆదరణ లభిస్తుంది. ఈ సినిమా 'ఒక రాధ ముగ్గురు కృష్ణులు' ట్రైలర్ బాగుంది. మా ఫిలిం చాంబర్ తరుపున ఎప్పుడు వాళ్ళకి సహాయసహకారాలు అందిస్తాము. చిన్న సినిమాలని అందరు ప్రోత్సహించాలి. ఈ సినిమా హిట్ కావాలి అని కోరుకుంటున్నాను " అని తెలిపారు.

    సురేష్ కొండేటి మాట్లాడుతూ "గతంలో కమల్ హస్సన్ గారి ఒక రాధ ఇద్దరు కృష్ణులు సినిమా చాల సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా ఒక రాధా ముగ్గురు కృష్ణులు మరింత విజయం కావాలి అని కోరుకుంటున్నాను. పరకోటి బాలాజీ గారికి అల్ ది బెస్ట్ " అని ముగించారు.

    Oka Radha Mugguru Krishnulu audio released

    మోహన్ గౌడ్ మాట్లాడుతూ "దర్శకుడు బాలాజీ నాకు చాలా కాలం గా తెలుసు. ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ లో సక్సెస్ ఫుల్ సినిమా తీస్తాను అని ఇండస్ట్రీ ని నమ్ముకుని ఉన్న వ్యక్తి . ఇప్పుడు ఈ చిత్రం తో తన కొడుకుని కూడా పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమా ఒక రాధ ముగ్గురు కృష్ణులు, వెరైటీ గా ఉంది టైటిల్. మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంది. సంగీతం చాల బాగుంటుంది, మ్యూజిక్ డైరెక్టర్ జయ సూర్య కి నా శుభాకాంక్షలు. ఈ సినిమా మంచి విజయవంతం కావాలి " అని కోరుకున్నారు.

    దర్శకుడు బాలాజీ మాట్లాడుతూ "ఒక రాధ ముగ్గురు కృష్ణులు, ఈ సినిమా కథ శ్రీరంగం సతీష్ కుమార్ గారికి చోపాను, కథ బాగా నచ్చి, సతీష్ కుమార్ గారి సహాయం తో సినిమా మొదలు పెట్టాను. కొత్తవాళ్లతో సినిమా మొదలు పెట్టాను, మంచి కామెడీ తో రొమాంటిక్ గా యూత్ ఫుల్ ఉంటుంది సినిమా. వచ్చేనెల జూన్ లో విడుదల చేస్తాం.

    శ్రీరంగం సతీష్ కుమార్ మాట్లాడుతూ "నేను నిర్మాత దర్శకుడిని అయినా కూడా బాలాజీ గారి మీద నమ్మకంతో సినిమా కథ పై నమ్మకం తో ఒక మంచి చిత్రం చేయటానికి సన్నాహాలు చేసాం. ఇది చిన్న చిత్రం కాదు కానీ మంచి చిత్రం. గతం లో జంబలకిడి పంబ, చిత్రం భళారే విచిత్రం కథ కథనం తో సక్సెస్ అయ్యాయి. ఈ సినిమా కూడా అలాంటి కథ కథనం తో అనుకున్న బడ్జెట్ లోనే నిర్మించాం. సినిమా చాల బాగా వచ్చింది. విజయవంతం అవ్వాలని కోరుకుంటున్న" అని తెలిపారు .

    హీరోయిన్ అనూష వేణు గోపాల్ మాట్లాడుతూ "బాలాజీ గారు నాకు మంచి అవకాశం ఇచ్చారు, కుటుంబ సభ్యులందరు కలిసి చూడదగ్గ చిత్రం " అని తెలిపారు.

    సంగీత దర్శకుడు జయ సూర్య మాట్లాడుతూ "గతం లో 25 సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశాను, ఈ సినిమా లో మూడు పాటలు ఉన్నాయ్. మంచి పాటలు, ఈ అవకాశం కోసం బాలాజీ గారికి ధన్యవాదాలు. పాటలు మరియు సినిమా మంచి హిట్ కావాలి అని కోరుకుంటున్న" అని తెలిపారు.

    English summary
    Oka Radha Mugguru Krishnulua audio released. For this event, film unit and Suresh Kondeti others attended. All the guest are wishes movie would be grant success.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X