»   » వేలుపిళ్లై ప్రభాకర్‌గా మంచు మనోజ్.. ఒక్కడు మిగిలాడు పోస్టర్ అదిరింది..

వేలుపిళ్లై ప్రభాకర్‌గా మంచు మనోజ్.. ఒక్కడు మిగిలాడు పోస్టర్ అదిరింది..

Posted By:
Subscribe to Filmibeat Telugu

విభిన్నమైన పాత్రలను ఎంచుకోవడంలో టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌ది డిఫరెంట్ రూట్. తాజాగా మనోజ్ నటిస్తున్న సినిమా ఒక్కడు మిగిలాడు. ఈ చిత్రంలో తమిళ ఈలం (ఎల్టీటీఈ) నాయకుడు వేలుపిళ్లై ప్రభాకరన్ పాత్రను పోషించడం విశేషం. ఈ చిత్రం తమిళ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్నది. తాజగా ఒక్కడు మిగిలాడు చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్

ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్

శనివారం (13 మే) రోజున విడుదలైన ఒక్కడు మిగిలాడు సినిమా పోస్టర్‌కు మంచి స్పందన లభిస్తున్నది. తుపాకులు మధ్య మంచు మనోజ్ నిలుచున్న ఈ పోస్టర్‌ ఆసక్తి రేపుతున్నది. ఈ పోస్టర్‌ను మంచు మనోజ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ సినిమాలో మంచు మనోజ్ డబుల్ రోల్ పోషించడం గమనార్హం. ఈ చిత్రానికి అజయ్ అండ్రూ నూతక్కి దర్శకత్వం వహిస్తున్నారు.

తొలిసారి డబుల్ రోల్..

తొలిసారి డబుల్ రోల్..

నా కెరీర్‌లో తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాను. ఒక పాత్రలో ఎల్‌టీటీఈ టైగర్‌గా కనిపిస్తాను. మరోపాత్రలో విద్యార్థి నేతగా నటిస్తున్నాను అని ట్వీట్ చేశారు. మిలటరీ డ్రస్సులో ఉన్న ఫొటో మంచు మనోజ్ ఫోటో‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఈ చిత్రంపై భారీ అంచనాలను పెంచాయి.

 మనోజ్ కెరీర్‌లో బెస్ట్ మూవీ..

మనోజ్ కెరీర్‌లో బెస్ట్ మూవీ..

ఈ చిత్రం గురించి దర్శకుడు అజయ్ అండ్రూ మాట్లాడుతూ.. మంచు మనోజ్ కెరీర్‌లో బెస్ట్ మూవీగా అవుతుంది. అద్భుతమైన నటన, మంచి డైలాగ్స్‌ను ఈ చిత్రంలో ఆశించవచ్చు. గతనెల షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నది. త్వరలో టీజర్‌ను రిలీజ్ చేస్తాం అని తెలిపారు.

శివ నందిగామ మ్యూజిక్

శివ నందిగామ మ్యూజిక్

ఒక్కడు మిగిలాడు సినిమాలో అనిషా అంబ్రోస్ హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ చిత్రంలో ఆమె జర్నలిస్ట్ పాత్రను చేస్తున్నది. ఈ చిత్రానికి శివ నందిగామ మ్యూజిక్ అందిస్తున్నారు. ఎస్ఎన్ రెడ్డి, లక్ష్మికాంత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వీకే రామరాజు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

English summary
Telugu actor Manchu Manoj on Saturday commenced the promotion of his upcoming war movie Okkadu Migiladu while unveiling a visually-striking poster of the film. In Okkadu Migiladu, Manoj plays Velupillai Prabhakaran, the founder of militant organisation Liberation Tigers of Tamil Eelam or LTTE.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu