»   » నాగార్జున.. 'ఓం నమో వేంకటేశాయ' మోషన్ పోస్టర్

నాగార్జున.. 'ఓం నమో వేంకటేశాయ' మోషన్ పోస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వెంకటేశాయ'.

సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు. కాగా, 'ఓం నమో వెంకటేశాయ' మోషన్‌ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు.

rn

మోషన్ పోస్టర్

'ఓం నమో వెంకటేశాయ' మోషన్‌ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. ఇప్పటికే అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి చిత్రాలతో నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్ బాక్సాఫీసు వద్ద అద్భుతాలు క్రియేట్ చేసారు. ఈ నేపథ్యంలో ఓం నమో వెంకటేశాయ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

 డిసెంబర్ 24న టీజర్ రిలీజ్

డిసెంబర్ 24న టీజర్ రిలీజ్

డిసెంబర్‌ 24న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేస్తున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 హాథీరామ్‌ బాబాగా

హాథీరామ్‌ బాబాగా

అక్కినేని నాగార్జున హాథీరామ్‌ బాబాగా మరో అద్భుతమైన పాత్ర చేస్తున్న ఈ చిత్రంలో వేంకటేశ్వరస్వామిగా సౌరబ్‌జైన్‌ నటిస్తుండగా, భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క కనిపించనుంది. జగపతిబాబు, ప్రగ్యా జైస్వాల్‌, విమలా రామన్‌, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌, ప్రభాకర్‌, రఘుబాబు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

 ఓం నమో వెంకటేశాయ

ఓం నమో వెంకటేశాయ


దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రూపొందిస్తున్న ఈ చిత్రానికి స్వరవాణి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్‌.గోపాల్‌రెడ్డి, జె.కె.భారవి, కిరణ్‌కుమార్‌ మన్నె, గౌతంరాజు ఇతర సాంకేతిక వర్గం.

English summary
Watch Om Namo Venkatesaya Movie Motion Poster, Watch Om Namo Venkatesaya Teaser releasing on 24th December. #OmNamoVenkatesya produced by Mahesh Reddy and Girish Reddy under the banner Sai Krupa Entertainment Pvt Ltd. Directed by K Raghavendra Rao. Music composed by MM Keeravani. Starring Nagarjuna, Anushka, Sourabh, Pragya Jaiswal and Vimala Raman. Music for this devotional movie is composed by MM Keeravani.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu