twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అభిమానికి అవమానం జరిగితే...పరుచూరి బ్రదర్స్

    By Srikanya
    |

    'అభిమానికి అవమానం జరిగితే పేలేది టపాసులు కాదు... తుపాకులు' అంటూ పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగుతో ఓంకార్ 'జీనియస్'చిత్రం మొదలైంది. ఓంకార్ దర్శకత్వంలో రూపొందనున్న 'జీనియస్' చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగాయి. రామదూత క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఓఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సమర్పిస్తోంది. హవీష్, సానుషా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి చిన్ని కృష్ణ కథ అందిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి డా.డి.రామానాయుడు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. వి.వి.వినాయక్ క్లాప్‌నిచ్చారు. ఎమ్మెల్యే మస్తాన్‌వలి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు.

    ఈ సందర్భంగా చిన్నికృష్ణ మాట్లాడుతూ "నా గత చిత్రాలన్నీ పుణ్యక్షేత్రాల నేపథ్యంలో సాగేవి. 'జీనియస్' విద్యాలయం చుట్టూ తిరుగుతుంది. అన్నాహజారే స్ఫూర్తితో రాసుకున్న కథ ఇది. ఫైర్ ఉన్న కాన్సెప్ట్. ప్రధానార్ఛకుడి కొడుకు పాత్రకు హవీష్ చక్కగా సరిపోయాడు. పరుచూరి బ్రదర్స్ ఈ చిత్రానికి పనిచేయడం ఆనందదాయకం. ఇంత గొప్ప సినిమాను తీస్తున్న దాసరి కిరణ్‌కు వంద గుండెలున్నాయనుకోవాలి. ఫిబ్రవరిలో సెట్స్‌మీదకు వెళ్తుంది. వేసవికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.

    ''ఈ సినిమాకి ఎవరు 'జీనియస్' అనేది రేపు ప్రేక్షకులే చెప్పాలి. ఇప్పటివరకు పెద్ద హీరోలకు కథ ఇచ్చిన చిన్నికృష్ణ మొదటిసారి కొత్తవారికి కథ ఇచ్చాడు'' అని పరుచూరి వెంకటేశ్వరరావు చెప్పారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ -''ఈ సినిమాకి మాటలు రాయడం ఓ సవాల్. స్క్రీన్‌ప్లే చాలా ఉత్కంఠగా ఉంది. ఓంకార్ ఈ చిత్రాన్ని అంతే ఉత్కంఠభరితంగా తీస్తాడనే నమ్మకం ఉంది. ఈ చరిత్ర ఏ సిరాతో, మరో మలుపు, కర్తవ్యంలాంటి చిత్రాలకు రాసినప్పుడు ఎంత గర్వపడ్డామో ఈ చిత్రానికి కూడా అంతే గర్వపడుతున్నాం'' అంటూ... 'అభిమానికి అవమానం జరిగితే పేలేది టపాసులు కాదు... తుపాకులు' అని ముహూర్తపు డైలాగ్ చెప్పారు.

    English summary
    Aata fame Omkar's Genius movie launched at Annapurna Studio.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X